స్పీడ్ న్యూస్ 4
posted on Jul 5, 2023 @ 5:36PM
1. బీమా పరిహారం అడిగిన అన్నదాతలపై కేసులు సిగ్గుచేటని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. నష్టపోయిన పంటకు పరిహారం అడిగిన అన్నదాతలపై అనంతపురం జిల్లాలో కేసులు పెట్టడం జగన్ ప్రభుత్వ అహంకారానికి నిదర్శనమన్నారు.
2. రాష్ట్ర మహిళా కమిషనర్‌ను కలిసేందుకు వెళ్తున్న టీడీపీ మహిళా, జనసేన వీర మహిళలను పోలీసులు అడ్డుకున్నారు. టీడీపీ నేత వంగలపూడి అనిత ఆధ్వర్యంలో మహిళలపై జరుగుతున్న దాడులు వివరించేందుకు ఐలాపురం హోటల్‌కు బయలుదేరిన మహిళా నేతలను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
3. గుంటూరు జిల్లాలోని నరసరావుపేట మండలం పమిడిమర్రు వద్ద స్కూల్ బస్సుకు ప్రమాదం జరిగింది. బుధవారం ఉదయం విద్యార్థులతో వెళ్తున్న ఆక్స్‌ఫర్డ్ స్కూల్ బస్సు అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్నపొలాల్లోకి దూసుకెళ్లింది.
4. తిరుమలలో బుధవారం భక్తుల రద్దీ కొనసాగుతోంది. టోకెన్ రహిత సర్వదర్శనం కోసం 22 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.
5.రాష్ట్రంలో గంజాయి సాగు, మత్తు పదార్థాల సరఫరాను ఉక్కుపాదంతో అణచివేసేందుకు సంబంధిత శాఖలు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. సచివాలయంలో రాష్ట్ర స్థాయి నార్కోటిక్స్ కోఆర్డినేషన్ అపెక్స్ కమిటీ సమావేశంలో సీఎస్ మాట్లాడుతూ గంజాయి, మత్తు పదార్థాలను విక్రయించే వారిపై పీడీ యాక్టు కింద చర్యలు తీసుకోవాలన్నారు.
6. కేరళ ను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. నైరుతి రుతుపవనాల ప్రభావంతో పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.
7.అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌లో తెలుపు రంగు పొడి కలకలం సృష్టించింది. దానివల్ల భవనాన్ని కొంతసేపు అధికారులు ఖాళీ చేయించి, తనిఖీలు నిర్వహించారు.
8.మహారాష్ట్ర ఎన్సీపీలో ఏర్పడిన సంక్షోభం రోజుకో మలుపు తిరుగుతోంది. శరద్ పవార్, అజిత్ పవార్ వర్గాలు పోటా పోటీగా సమావేశాలకు పిలుపునిచ్చి, విప్ జారీ చేశాయి.
9.మతిస్థిమితం కోల్పోయిన ఓ మహిళ పందొమ్మిదేళ్ల కిందట ఇంటి నుంచి తప్పిపోయి ఇటీవల తిరిగి తన కుటుంబాన్ని కలుసుకుంది. తల్లి తిరిగొచ్చిన సంతోషంలో ఆమె పిల్లలు అమ్మానాన్నలకు మళ్లీ పెళ్లి చేసిన సంఘటన ఒడిశాలోని కటక్ జిల్లాలో చోటుచేసుకుంది.
10. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి మార్పుపై సీపీఐ నేత రామకృష్ణ స్పందించారు. సోము వీర్రాజుపై అనేక ఆరోపణలు వచ్చాయని వైసీపీకి అనుకూలంగా పని చేశారనే నింద ఉందని తెలిపారు.