సంక్షిప్త వార్తలు
posted on Jun 22, 2023 @ 2:34PM
1.వైసీపీకి జగన్ శాశ్వత అధ్యక్షుడు కాదని ఎంపీ రఘురామకృష్ణరాజుకు రాసిన లేఖలో కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొంది. వైసీపీ రెబల్ ఎంపీ లేఖకు కేంద్ర ఎన్నికల సంఘం ఈ మేరకు సమాధానం ఇచ్చింది.
2.భారత ప్రధాని నరేంద్ర మోదీపై ప్రముఖ హాలీవుడ్ నటుడు రిచర్డ్ గేర్ ప్రశంసల వర్షం కురిపించారు. భారత సంస్కృతీ సంప్రదాయాలకు మోదీ నిలువెత్తు నిదర్శనమని కొనియాడారు.
3.అమెరికా పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ ఆ దేశాధ్యక్షుడు జో బైడెన్‌తో సమావేశమయ్యారు. వైట్ హౌస్‌లో మోడీకి బైడెన్ దంపతులు సాదర స్వాగతం పలికారు. ఆ తరువాత ఇరు నేతలూ పలు ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు.
4. తెలంగాణలో రైతుబంధు పథకం కింద కొత్త రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు వారి నుంచి దరఖాస్తులు స్వీకరించాలని క్షేత్రస్థాయి అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
5. చైనాలో ని ఇంచువాన్‌లో ఓ రెస్టారెంట్‌లో బుధవారం రాత్రి గ్యాస్ సిలిండర్ పేలి 31 మంది అక్కడిక్కడే దుర్మరణం పాలయ్యారు. మరో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉంది.
6. 65 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజటన్ల కర్నాటకలోని 400 ఆలయాల్లో క్యూలో నిలబడనవసరం లేకుండా నేరుగా దర్శనం చేసుకునేందుకు వీలు కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వ్యులు జారీ చేసింది. అయితే ఇందుకు ఆధార్ కార్డు లేదా ఏదో ఒక గుర్తింపు కార్డు చూపాల్సి ఉంటుంది.
7. గోసంరక్షణ పేరుతో చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే కఠిన చర్యలు తప్పవని నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ హెచ్చరించారు. పశువుల అక్రమ రవాణాకు సంబంధించిన సమాచారం ఉంటే పోలీసులకు కానీ, జీహెచ్ఎంసీ, ఇతర అధికారులకు తెలియజేయాలన్నారు.
8. ఏపీ సీఎం జగన్మోహాన్ రెడ్డి అక్రమాస్తుల కేసుకు సంబంధించిన పెన్నా సిమెంట్స్ ఛార్జ్‌షీట్‌లో నిందితురాలిగా ఉన్న తన పేరును తొలగించాలని తెలంగాణ విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి దాఖలు చేసిన డిశ్చార్జ్ పిటిషన్‌పై విచారణను సీబీఐ కోర్టు ఈ నెల 28కి వాయిదా వేసింది. )
9. ప్రముఖ కవి ఆచార్య ఎన్.గోపికి ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ విశిష్ట సాహిత్య పురస్కారాన్ని భారత జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రదానం చేశారు. అవార్డు కింద రూ.1,01,116 నగదుతో పాటు స్వర్ణ కంకణాన్ని బహూకరించారు.
10. అమెరికా పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ అక్కడి పారిశ్రామికవేత్తలతో భేటీ అయ్యారు. భారత్‌లో పెట్టుబడులు పెట్టాలంటూ వారిని ఆహ్వానించారు. మైక్రాన్ టెక్నాలజీ సీఈఓ సంజయ్ మెహ్రోత్రా, జనరల్ ఎలక్ట్రిక్ సీఈఓ లారెన్స్ కల్ప్ తదితరులతో మోడీ భేటీ అయ్యారు.