న్యూజిలాండ్ టెస్ట్ సిరీస్.. భారత జట్టు ఇదే..
posted on Sep 12, 2016 @ 4:57PM
ఈ నెల 22 నుంచి న్యూజిలాండ్, భారత్ ల మధ్య తొలి టెస్టు మ్యాచ్ జరగనున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు న్యూజిలాండ్ తో తలపడే భారత జట్టును బీసీసీఐ కొద్ది సేపటి క్రితమే ప్రకటించింది. విరాట్ కోహ్లీ (కెప్టెన్), కేఎల్ రాహుల్, ఛటేశ్వర్ పుజారా, అజింక్యా రహానే, మురళీ విజయ్, రోహిత్ శర్మ, రవిచంద్రన్ అశ్విన్, వృద్ధిమాన్ సాహా, రవీంద్ర జడేజా, మొహమ్మద్ షమీ, ఇషాంత్ శర్మ, భువనేశ్వర్ కుమార్, శిఖర్ ధావన్, అమిత్ మిశ్రా, ఉమేష్ యాదవ్ లు జట్టు సభ్యులు. కాగా మొదట టెస్ట్ మ్యాచ్ కు కాన్పూర్ లోని గ్రీన్ పార్క్ వేదిక కానుంది. తరువాత 30 నుంచి అక్టోబర్ 4 వరకూ కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో, ఆఖరి టెస్టు ఇండోర్ లోని సరికొత్త హోల్కర్ స్టేడియంలో జరగనున్నాయి.