Read more!

ఇది మరో బోఫోర్స్ కుంభకోణ౦!

 

 

 

 

తాజా హెలికాప్టర్ల కొనుగోలు కుంభకోణం మరో బోఫోర్స్ కుంభకోణమని అంటూ బీజేపి విరుచుకు పడింది. ఈ ఒప్పందాన్ని రద్దు చేయాలని యూపీఏ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ అంశాన్ని పార్లమెంట్‌లో లేవనెత్తేందుకు సిద్ధమవుతున్నట్లు ప్రకటించింది. ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టడంలో కాంగ్రెస్ ఉక్కిరి బిక్కిరి అవుతోంది.

 

ఇప్పటికే ఈ కుంభకోణంపై సీబీఐ, ఈడీ దర్యాప్తునకు కేంద్రం ఆదేశించారు. హెలికాప్టర్ల కొనుగోలు కుంభకోణంలో దోషులెవర్నీ వదిలిపెట్టమని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. అవరమైతే హెలికాప్టర్ల ఒప్పందాన్ని రద్దు చేస్తామని కేంద్ర రక్షణ శాఖ మంత్రి ఏ.కే.ఆంటోని ప్రకటించారు. ఇటలీకి చెందిన వీవీఐపీ హెలికాఫ్టర్ కొనుగోలు ఒప్పందంలో చోటు చేసుకున్న అవకతవకల్లో తన పాత్ర ఏమాత్రం లేదని, ఈ విషయంలో ఎలాంటి విచారణకైనా సిద్ధంగా ఉన్నట్టు భారత ఎయిర్‌మార్షల్ చీఫ్ ఎస్.పి.త్యాగి వెల్లడించిన సంగతి తెలిసిందే.


మొత్తం 3,600 కోట్ల రూపాయల వ్యయంతో ఇటలీ ఎయిర్ స్పేస్ కంపెనీ నుంచి 12 అగస్టా వెస్ట్‌ల్యాండ్ హెలికాఫ్టర్లను కొనుగోలు ఒప్పందంలో భారత్ లంచాలు చెల్లించినట్టు ఇటలీ పత్రికలు వార్తా కథనాలను ప్రసారం చేశాయి.