కేసీఆర్‌కు రేవంత్ బహిరంగ లేఖ
posted on Sep 6, 2016 @ 9:05PM
తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటు రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. జిల్లాల ఏర్పాటు కొందరికి నచ్చుతుండగా మరికొందరికి నచ్చడం లేదు. గద్వాలను జిల్లాగా ప్రకటించాలంటూ మాజీ మంత్రి డీకే అరుణ ఆందోళన ఉధృతం చేయగా కేసీఆర్ సర్కార్ పట్టించుకున్న పాపాన లేదు. సరిగ్గా ఇలాంటి సమయంలో టీటీడీపీ నేత తెలంగాణ సీఎం కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాసి కలకలం సృష్టించారు. రాష్ట్రంలో నియోజకవర్గాల పునర్విభజన జరిగిన తర్వాతే కొత్త జిల్లాల ఏర్పాటు చేయాలని ఆయన లేఖలో పేర్కొన్నారు. ఆయ ప్రాంతాల అభిప్రాయాల మేరకే కొత్త జిల్లాల ఏర్పాటు చేయాలని, జనగామ జిల్లాపై సీఎం ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని కోరారు. కొత్త జిల్లాల ఏర్పాటుకు అఖిలపక్షం చేసిన సూచనలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేయొద్దని అన్నారు. రేవంత్ లేఖ జిల్లాల ఏర్పాటును వ్యతిరేకిస్తున్న వారికి ఒక ఆయుధంగా మారే అవకాశం ఉండటంతో కేసీఆర్ సర్కార్‌కు కాస్త ఇబ్బందిగా మారే సూచనలు కనిపిస్తున్నాయి.