కాబోయే బాస్ కొత్తరూల్స్

 

కొత్తగా రాష్ట్రంనుండి పదవులొచ్చిన కేంద్రమంత్రులకు కాబోయే కాంగ్రెస్ అధినాయకుడైన రాహూల్ గాంథీ కొత్తరూల్స్ పెట్టారు. అవేమిటంటే  పదవులకన్నా పార్టీకే ముఖ్య ప్రాధాన్యత నివ్వాలి. అలాగే ఒక్కొక్క మంత్రి కనీసం రెండు జిల్లాలను పర్యవేక్షించాలి. ఎప్పటికప్పుడు కార్యకర్తలతో దగ్గర సంభంధాలు కొనసాగించాలి. అలాగే అవసరమైనప్పుడు లేదా కేంద్రం అడిగినప్పుడల్లా రాష్ట్ర, జిల్లా పరిస్థితులను రిపోర్టు చేయాల్సి వుంటుంది,

 

ఎమ్మెల్యేలు, ఎంపిలు, నాయకులు, లీడర్లు పార్టీ నుండి బయటికి పోకుండా చూడాలి. ప్రజలకు సంక్షేమ పధకాలను గురించి వివరించాలి. రానున్న ఎన్నికల్లో కనీసం 30 ఎంపి సీట్లు ఆంద్రప్రదేశ్ నుండి తెచ్చే విధంగా కర్యాక్రమాలు అమలు జరగాలని వారు కోరుకుంటున్నారు. దీనికి సంబంధించే ప్రధాన మంత్రి రేపు మంత్రులందరినీ ఒక సారి రమ్మన్నట్లు కూడా తెలుస్తుంది. రాష్ట్రాన్ని ప్రశాంతంగా ఉంచి ఏలాంటి ఉద్యమాలు జరగకుండా చూడాలని కూడా వారు కోరుతున్నారు.

 

కార్యకర్తల్లో ఆత్మస్ధయిర్యాన్ని నింపాలని అధిష్టానం కోరుతుంది. దీనికి అనుగుణంగానే కొత్త మంత్రి వర్గాన్ని ఏర్పాటు చేసినట్లు రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఇందులో భాగంగానే అధినేత్రి సోనియాగాంథీ తనయుడు పార్టీ పగ్గాలు చేపట్టేందుకు సంసిద్దాంగా వున్నట్లు సీనియర్ నాయకులు చెబుతున్నారు. రానున్న ఎన్నికల్లో గెలిచి రాహుల్ ప్రధాన మంత్రిగా కొన సాగటానికి ఇప్పటినుండే పావులు ఈ విధంగా పావులు కదుపుతున్నట్లు తెలుస్తుంది.