Read more!

ఎన్ని అవమానాలు ఎదురైనా..ఈ పనులు పూర్తి చేయండి..విజయం మిమ్మల్ని వరిస్తుంది..!

మన జీవితంలో విజయం సాధించాలనే ఆశయం ఉంటే... కొన్ని విషయాల పట్ల మనం సిగ్గుపడకూడదు. అప్పుడే మనం సంతోషంగా ఉండగలం.ఎన్ని అవమానాలు ఎదురైనా..తట్టుకుని ముందుకు సాగుతే  విజయం మిమ్మల్ని వరిస్తుంది. ఆ విషయాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఆచార్య చాణక్యుడు జీవితానికి సంబంధించిన చెప్పిన అక్షర సత్యాలు,  విధానాలు నేటికీ ఆచరణీయంగా ఉన్నాయి. చాణక్య నీతిపై ఆచార్య చాణక్యుడి అనుభవం, ఆలోచనలు జీవితానికి ఒక పాఠం వంటిది. జీవితంలో విజయం సాధించడానికి చాణక్య నీతి మనకు సహాయం చేస్తుంది. వాటిని పాటిస్తే జీవితంలో గొప్ప విజయాలు సాధిస్తామని చెప్పవచ్చు.చాణక్యుడి ప్రకారం మనం కొన్ని విషయాల్లో సిగ్గుపడకూడదు. సిగ్గుపడితే ఎన్నో ఇబ్బందులు పడాల్సి వస్తుంది.

- మనం ఆహారం విషయంలో ఏ కారణం చేతనూ సిగ్గుపడకూడదు. ముఖ్యంగా బయటకు వెళ్లినప్పుడు తినడానికి ముందు వెనుకకు చూడకూడదు. ఇది మీ కడుపు నింపదు.

- డబ్బు సంపాదనతోనే మనం బ్రతకగలం. కాబట్టి మనం న్యాయంగా డబ్బు సంపాదించడానికి ఏ కారణం చేతనైనా వెనుకాడకూడదు. సిగ్గుపడితే కష్టాల పాలవుతాం.

- కొన్నిసార్లు ఇతరులకు డబ్బు అప్పుగా ఇస్తాం. ఇచ్చిన అప్పును అడిగేందుకు నామూషిగా ఫీల్ అవుతుంటాం.  అయితే సిగ్గుతో డబ్బు అడగకూడదని చాణక్యుడు చెప్పాడు.

-పాఠం నేర్చుకోవడానికి, అంటే విద్యను పొందడానికి మనం ఎప్పుడూ సిగ్గుపడకూడదు. మనం ఎంత నేర్చుకున్నా పూర్తి కాలేదని ఎప్పుడూ రాయకూడదు.