నెటిజన్ల ట్రోలింగ్ కు రోజా మరోసారి
posted on Nov 14, 2022 @ 11:24AM
ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా... తాజా వీడియో ఒకటి నెట్టింట తెగ హల్‌చల్ చేస్తోంది. పూర్తిగా కాషాయం బట్టలతో ఆర్కే రాజా పడవపై కూర్చొని.. నదీ విహారం చేస్తూ.. పక్షులకు గింజలు వేస్తూ.... తపస్సు చేస్తూ.. పడవపై కూర్చొని కాళ్లతో నదీలో నీళ్లతో ఆడుతోంది. మంత్రి ఆర్కే రోజా.. అయోధ్యలోని రామజన్మ భూమిలో పర్యటించారని.. అనంతరం ఆమె త్రివేణి సంగమం వద్ద నదీ విహారం చేస్తున్న సమయంలోనిదీ వీడియో అంటూ అటు మీడియాలో ఇటు సోషల్ మీడియాలో కథనాలు వెల్లువెత్తాయి. రోజా వీడియోపై నెటిజన్లు.. తమదైన శైలిలో స్పందిస్తున్నారు. పర్యాటక శాఖ మంత్రిగారికి ఇంతకన్నా పనేముందని ఓ నెటిజన్ కామెంట్ చేస్తే.. పర్యాటక శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత.. రోజమ్మ గారు గుళ్లూ గోపురాలకు కీ ఇచ్చిన బొంగరంలా రింగ రింగా అంటూ తిరిగేస్తున్నారని మరో నెటిజన్ కామెంట్ పెట్టారు.
ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లోని గుళ్లూ గోపురాలన్నీ ఈ మంత్రి రోజా తిరిగేశారని.. ఇప్పుడు దేశంలోని గుళ్లు గోపురాల చుట్టూ ప్రదక్షణ చేస్తున్నారని ఇంకో నెటిజన్లు పేర్కొన్నారు. మరోకరు అయితే ఏకంగా.. తీర్థయాత్ర.. తీర్థయాత్ర.. తీర్థయాత్ర అంటూ కామెంట్ పేట్టేశారు. జపం జపం జపం.. కొంగ జపం.. అంటూ మరో నెటిజన్ సెటైరికల్‌గా కామెంట్ పెట్టాడు.
రోజా... గతంలో సినిమాల్లో హీరోయిన్‌గా నటించారని.. ఆ రంగం నుంచి ఇంకా ఆమె బయటకు రాలేకపోతోందని మరి కొందరు అంటున్నారు. అయినా బాధ్యతగల ఓ మంత్రిగా రోజా ఆ బట్టలు? ఆ మెడలో దండ ఏమిటని ప్రశ్నిస్తున్నారు.
అయినా ఇటీవల విశాఖ ఎయిర్ పోర్టులో ఆర్కే రోజా వ్యవహారంపై ఇప్పటికే సోషల్ మీడియా సాక్షిగా నెటిజన్లు మండిపడుతున్నారు. కీలక మంత్రి పదవిలో ఉండి.. ఇలా వ్యవహరించడం ఎంత వరకు సబబు అని నెటిజన్లు నిప్పులు చెరుగుతున్నారు. ముఖ్యమంత్రిగా వైయస్ జగన్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రజల్లోకి అంతగా వచ్చిందేలేదని... అలాగే మంత్రులుగా బాధ్యతలు చేపట్టిన తర్వాత.. కనీసం సమీక్ష సమావేశాలు కూడా నిర్వహించకుండా.. ప్రజా సమస్యలను పట్టకుండా రాష్ట్రంలో ఉండకుండా... బయట రాష్ట్రాల్లో పర్యటనలు ఏమిటని ప్రశ్నిస్తున్నారు.
జగన్ తొలి కేబినెట్‌లోనే కాదు.. మలి కేబినెట్‌లో సైతం అలాంటి మంత్రులే ఉన్నారని నెటిజన్లు అంటున్నారు. మరోవైపు కొత్తా దేవుడండి.. కొంగొత్త దేవుడండీకి పేరడీగా.. కొత్త దేవతండి.. కొంగొత్త దేవతండి అంటూ మంత్రి రోజా వ్యవహార శైలిపై ఉందని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. ఏది ఏమైనా మంత్రి రోజా నిత్యం వార్తల్లో ఉండేందుకే ఇలా వ్యవహరిస్తున్నారంటూ విమర్శలు గుప్పిస్తున్నారు.