కాంగ్రెస్ పార్టీలోకి చేరిన నవజ్యోత్ కౌర్ సిద్దూ...
posted on Nov 28, 2016 @ 5:01PM
మాజీ క్రికెటర్, నవజ్యోత్ సింగ్ సిద్దూ భార్య బీజేపీ మాజీ ఎంపీ నవజ్యోత్ కౌర్ సిద్దూ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఢిల్లీలో కాంగ్రెస్ సీనియర్ నేత రణ్‌దీప్ సర్జేవాలా సమక్షంలో నవజ్యోత్ కౌర్ సిద్దూ శిరోమణి అకాలీదళ్ మాజీ ఎమ్మెల్యే పర్గత్ సింగ్‌తో కలిసి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా నవజ్యోత్ కౌర్ మాట్లాడుతూ... వచ్చే ఎన్నికల్లో పశ్చిమ అమృత్‌సర్ స్థానం నుంచి తాను పోటీ చేయనున్నట్లు తెలిపారు. పార్టీని కేత్రస్థాయిలో బలోపేతం చేసేందుకు తన వంతు కృషి చేస్తానని ఆమె తెలిపారు.
కాగా కొద్ది రోజుల క్రితం నవజ్యోత్ సింగ్ సిద్దూ.. నవజ్యోత్ కౌర్ సిద్దూ బీజేపీ పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ తరువాత వీరు ఆప్ పార్టీలోకి కానీ.. కాంగ్రెస్ పార్టీలోకి కానీ చేరుతారు అనుకున్నారు. కానీ సిద్దూ వేరే కొత్త పార్టీ పెట్టారు. అయితే ఇప్పుడు సిద్దూ భార్య ఆయన పార్టీను కాదని కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. ఇక ఈమె చేరిక వెనుక కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ కూతురి ప్రియాంక గాంధీ హస్తం ఉన్నట్టు తెలుస్తోంది.