నర్సింగ్ యాదవ్‌కి క్లిన్ చిట్.. రియో ఒలింపిక్స్‌లో యాదవ్
posted on Aug 1, 2016 @ 6:13PM
రెజ్లర్ నర్సింగ్ యాదవ్ డోపింగ్ కు పాల్పడ్డాడంటూ ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈవిషయంలో నర్సింగ్ యాదవ్ కు ఊరట లభించింది. ఈ వ్యవహారంలో సమగ్ర దర్యాప్తులో రియోకు నర్సింగ్ యాదవ్ నే పంపాలని నిర్ణయించింది.. దీంతో రియో ఒలపింక్స్ లో నర్సింగ్ యాదవ్ పాల్గొననున్నాడు. 74 కేజీల రెజ్లింగ్ విభాగంలో నర్సింగ్ యాదవ్ పాల్గొననున్నాడు.
కాగా రియో ఒలంపిక్స్ లో రెజ్లర్ల జాబితాలో నర్సింగ్ యాదవ్ పేరు విడుదలైనప్పటినుండి ఎన్నో అడ్డంకులు ఎదురవుతూనే ఉన్నాయి. దానికి తోడు డోపింగ్ కు పాల్పడ్డాడంటూ వాడా రిపోర్టులు నిర్ధారించడం. నర్సింగ్ యాదవ్ నిషేధిత డ్రగ్స్ వినియోగించాడంటూ ఫలితాలు రావడంతో నర్సింగ్ యాదవ్ ఒలింపిక్ కలలు కల్లలయ్యాయి. న్యాయస్థానాల్లో కూడా అతని ప్రాతినిధ్యంపై కేసు నమోదైంది. అయితే ప్రత్యర్థులు చేసిన ట్వీట్ తో తీగ కదిలింది. దీంతో నర్సింగ్ యాదవ్ వివరణ, అనుమానాలు విన్న రెజ్లింగ్ సమాఖ్య...అతనికి అండగా నిలిచింది. ఈ ఆరోపణలపై సమగ్ర దర్యాప్తు జరిపి.. వివరాలను ఒలింపిక్ సంఘానికి తెలపడం ద్వారా నర్సింగ్ యాదవ్ ను బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద ఒలింపిక్స్ లో పాల్గొనే అవకాశం కల్పించారు.