Read more!

జగన్ మానసిక వ్యాధి ‘నార్సీ’ - పార్ట్ 3

వైసీపీ నాయకుడు జగన్‌కున్న మానసిక వ్యాధి పేరు ‘నార్సిసిస్టిక్ పర్సనాలిటీ డిజార్డర్’ అని, దాన్ని షార్ట్‌కట్‌లో ‘నార్సి’ అంటారని, ఆ వ్యాధికి వున్న కొన్ని లక్షణాలను ఇంతకుముందు రెండు భాగాల్లో వివరించడం జరిగింది. ఇప్పుడు ‘నార్సీ’ మానసిక వ్యాధిగ్రస్తులకు వుండే ఇతర లక్షణాలను చూద్దాం. 

జగన్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు తెలుగుదేశం ప్రభుత్వం మూడు లక్షల టిడ్కో ఇళ్ళ నిర్మాణం పూర్తి చేసింది. వాటిని జగన్ ప్రభుత్వం లబ్ధిదారులకు ఇవ్వలేదు. ఐదేళ్ళుగా అవి పాడుబడిపోయి వున్నాయి. వాటిని అలా ఉంచేసి, జగన్ సెంటు భూమి పథకం పట్టుకొచ్చాడు. సెంటు భూమి ఎలా సరిపోతుంది? ఆ ఇచ్చే భూమి కూడా ఎక్కడో ఊరు చివరో, మునక ప్రమాదం వున్న ప్రాంతాల్లోనే ఇచ్చాడు. ఇళ్ళు కట్టుకోవడానికి సహాయం కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చింది కాబట్టి ఇవ్వక తప్పని పరిస్థితి. ఇంకా ఈ స్కీములో ఎన్నో స్కాములు, తిరకాసులు, లబ్ధిదారులను స్థలం ఇచ్చాం కాబట్టి మా పార్టీకి ప్రచారకర్తలుగా పనిచేయాలంటూ బెదిరించడం.. ఇలాంటి లీలలు ఎన్నెన్నో. మరి పేదకు ఇళ్ళు సమకూర్చే ఈ పథకాన్ని ఇంత నాశనం చేసిన జగన్, చంద్రబాబు ఇచ్చి టిడ్కో ఇళ్ళు బాగున్నాయని ఎవరైనా అంటే తట్టుకోగలడా.. అందుకే వాటిని పాడుబెట్టేశాడు.

జగన్ ఎప్పుడూ దుష్ట చతుష్టయం అనే మాటను వాడుతూ వుంటాడు. జగన్ తనకు వ్యతిరేకంగా మాట్లాడేవాళ్ళందర్నీ ఒక తాటిమీద కట్టేస్తాడు.  ఎవరైతే జగన్ ప్రభుత్వం గురించి నిజాలు చెప్తున్నారో వాళ్ళను దొంగలు, దగుల్బాజీలు, అట్లాంటి వాళ్ళు.. ఇట్లాంటివాళ్ళు వాళ్ళ మీద అబద్ధాలు దుష్పచారం చేస్తాడు. చివరికి వాళ్ళు చెప్పే నిజాన్ని కూడా జనం నమ్మని పరిస్థితి తెస్తాడు. అప్పుడు వాళ్ళు ఎంత గట్టిగా నిజం చెప్పినా జనం పట్టించుకోవడం మానేస్తారు. ఇలా జరగడం ప్రపంచంలో ఇది మొదటిసారి కాదు... ఉదాహరణకు, 10 రూపాయల నాణెం దేశం మొత్తంలో చెలామణీలో వుంది. కానీ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం పదిరూపాయల నాణాన్ని విలన్ని చూసినట్టు చూస్తారు. ఎందుకంటే, ఎప్పుడో ఒకసారి పదిరూపాయల నాణెం చెల్లదనే పుకారు వచ్చింది. దాన్ని జనం నమ్మేశారు. చదువుకున్నవారు.. చదువుకోనివారు.. పెద్దపెద్ద ఉద్యోగాలు చేసేవారు.. అందరూ పదిరూపాయల నాణాన్ని తీసుకోవడం మానేశారు. పదిరూపాయల నాణెం చెల్లదని అంటే జైలుకు పంపిస్తామని రిజర్వ్ బ్యాంక్ చెప్పినా జనం ఇప్పటికీ పది రూపాయల నాణాన్ని మిగతా కాయిన్స్.ని నమ్మినట్టుగా నమ్మరు. పుకారుకు వున్న బలం అలాంటిది. జగన్ అండ్ టీమ్ కూడా తమను వ్యతిరేకించే వారికి వ్యతిరేకంగా రకరకాల పుకార్లు పుట్టిస్తారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5, మహాన్యూస్ నిజాలు చెబుతూ వుండేసరికి వాటికి టీడీపీ రంగు, కులంరంగు పులుముతారు. వాళ్ళూ వాళ్ళూ ఒక కులం వాళ్ళు కాబట్టి జగన్‌కి వ్యతిరేకంగా ఈ న్యూస్ రాసి వుంటార్లే అని జనం అనుకునేలా చేయడం ఒక వ్యూహాత్మక కుట్ర. న్యూట్రల్‌గా వున్నవారిని కూడా ప్రజలు నమ్మకుండా చేసే భయంకరమైన కుట్ర. ఇదే నార్సీ విధానం.

ఆమధ్య చంద్రబాబు నాయుడు భార్య మీద దుర్మార్గమైన కామెంట్లు చేశారు. చంద్రబాబు నాయుడు ఈ విషయం మీద మాట్లాడుతూ రోదిస్తే, దాన్ని మీడియాలో చూపించీ చూపించీ.. అతను ఏడవడం లేదు.. డ్రామా చేస్తున్నాడు అంటూ  జనాన్ని నమ్మించే ప్రయత్నం చేశారు. మనిషి అనేవాడు పగవాడు కళ్ళ వెంట నీరు పెట్టుకుంటే కొంచెమైనా చలిస్తాడు. అయ్యో అనుకుంటాడు. అదే ఒక మనిషి ఏడుస్తుంటే చూసి మనసు నిండా విశృంఖలంగా ఆనందం కలిగితే దాన్ని శాడిజం అంటారు. ఆ శాడిజం పుష్కలంగా కలిగిన వ్యక్తి జగన్. తనకున్న శాడిజాన్ని తనను నమ్మే వారి మనసులలో కూడా బలంగా నాటడమే ఈ నార్సీ విధానం. నార్సీ మానసిక వ్యాధి వున్నవాళ్ళు తనను అనుసరించే వాళ్ళలో వున్న రాక్షసత్వాన్ని నిద్ర లేపుతారు.  (ఇంకావుంది)