Read more!

జగన్ మానసిక వ్యాధి ‘నార్సీ’ - పార్ట్ 2

జగన్‌కున్న మానసిక వ్యాధి పేరు ‘నార్సిసిస్టిక్ పర్సనాలిటీ డిజార్డర్’ అని, దాన్ని షార్ట్‌కట్‌లో ‘నార్సి’ అంటారని, ఆ వ్యాధికి వున్న కొన్ని లక్షణాలను ఫస్ట్ పార్ట్.లో చెప్పడం జరిగింది. ఈ మానసిక వ్యాధిగ్రస్థులకి వుండే మరికొన్ని లక్షణాలను చూద్దాం.

జగన్ ప్లాన్‌లో జీవితాలను నాశనం చేసుకున్న యువత ‘వాలంటీర్’ అనే విష వలయంలో చిక్కుకున్నారు. ఉద్యోగాలు వుండి, ఉపాధి వుండి, పరిశ్రమలు వుంటే, ఐదు సంవత్సరాలుగా కేవలం ఐదువేల రూపాయలకే పనిచేసే యువత ఎలా దొరకుతారు? ఉపాధి లేకపోవడం వల్ల  కేవలం ఐదువేలు ఇచ్చే వాలంటీర్ ఉద్యోగంలో యువత చేరారు. జీవితంలో ఎదగాల్సిన, ఏదైనా స్కిల్, ఏదైనా నాలెడ్జ్ నేర్చుకుని ముందడుగు వేయాల్సిన యువత ఐదేళ్ళపాటు తమ జీవితాన్ని ‘వాలంటీర్’ అనే ఉచ్చులో చిక్కుకునేలా చేసుకున్నారు.  ఏదో సేవ చేస్తున్నాం, భవిష్యత్తు ఇంకా బాగుంటుంది అనే భ్రమల్లో చిక్కుకున్న యువత తమ జీవితాలలో విలువైన ఐదేళ్ళ సమయాన్ని వృధా చేసుకున్నారు. మధ్యలో జీతం పెంచమన్న పాపానికి ప్రభుత్వ పెద్ద నుంచి పిచ్చి తిట్లు కూడా తిన్నారు. ‘నార్సీ’ జగన్ తన అబద్ధాలను వాలంటర్లు నమ్మేలా చేసి, తన అబద్ధాలను ప్రచారం చేసేలా వాలంటీర్లను వాడుకున్నాడు. 

పోలవరం పూర్తయిందనుకోండి. కృష్ణానది నీటిని రాయలసీమకు తరలించి రాయలసీమను సస్యశ్యామలం చేయొచ్చు. అప్పుడు రాయలసీమ కూడా కృష్ణ, గోదావరి జిల్లాల తరహాలో మారుతుంది. అలా మారకుండా చేసి, కృష్ణ, గోదావరి జిల్లాల వాళ్ళ మీద రాయలసీమ వాళ్ళకి ద్వేషం పెంచేలా చేసే కుట్రలో భాగమే పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయకపోవడం. రాయలసీమ సస్యశ్యామలం అయితే పగలు, ప్రతీకారాలు వుండవు, ఫ్యాక్షనిజం వుండదు.. అందరూ సంతోషంగా వుంటే తన మాట వినేవారు వుండరు.. అందుకే రాయలసీమను యథాతథంగా వుంచే కుట్రలో భాగంగానే పోలవరాన్ని పక్కనపెట్టాడు. 

ఇక మద్యం గురించి చెప్పాలంటే, మద్యాన్ని నిషేధిస్తానని అధికారంలోకి వచ్చాడు. కేవలం స్టార్ హోటళ్ళలో మాత్రమే మద్యం అమ్మేలా చేస్తానని, మద్య నిషేధం చేయకపోతే ఓటు అడగనని చెప్పి అధికారంలోకి వచ్చాడు. చెప్పింది చేయకపోతా విషం లాంటి కల్తీ మద్యాన్ని, రేట్టు మూడు నాలుగు రెట్లు పెంచి అమ్మాడు. ఇది కేవలం సొంత బ్రాండ్స్ ద్వారా వచ్చే డబ్బుకు ఆశపడి మాత్రమే కాదు... అంతకు మించి.. అంతకు మించి... ఒక మగాడు మద్యానికో, గంజాయికో బానిసైపోతే ఆ కుటుంబం చెల్లాచెదురైపోతుంది. అతలాకుతలం అయిపోతుంది. ఆ ఇంటి ఇల్లాలికి జగనన్న అవసరం పడుతుంది. కల్తీ మద్యం ద్వారా బావ ఉసురు తీసి, చెల్లికి చక్కటి తెల్లటి చీర పెట్టే గొప్ప అన్న రాజకీయం ఇది. ఒక భయంకరమైన, దుర్మార్గమైన రాజకీయ క్రీడ ఇది. 

ఇక అన్న క్యాంటీన్ల పేరు మార్చి కొనసాగిస్తే, జనం చంద్రబాబుని మర్చిపోతారా? మర్చిపోరు.. ఎక్కడో ఒకచోట, ఎంతో కొంత చంద్రబాబు గుర్తు మిగిలిపోతుంది కదా.. అది జగన్ భయం.. అందుకే జనం కడుపు మీద తన్నాడు.. అన్న క్యాంటిన్లు మూసేశాడు. తన రాజకీయ మనుగడ కోసం పేద జనం నోటి దగ్గర వున్న అన్నం తీసేశాడు. అన్న క్యాంటిన్లు ఉన్నాయనుకోండి.. ‘చంద్రబాబు నాయుడు ఒక్క మంచి పని చేశాడా.. ఒక్క మంచి పని చేశాడా’ అని జగన్ పదే పదే అనలేడు కదా.. (ఇంకావుంది...)