రాజ్‌నాథ్‌తో నరసింహన్ భేటీ... అధికారాల గురించే...
posted on Aug 21, 2014 6:44AM
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ బుధవారం నాడు కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ని, ఆ తర్వాత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిశారు. హైదరాబాద్‌లో శాంతిభద్రతల పరిరక్షణ, ఉద్యోగుల బదిలీ వంటి అధికారాలను గవర్నర్‌కి బదిలీ చేస్తూ కేంద్రం జారీ చేసిన ఉత్తర్వులు వివాదాస్పదంగా మారిన నేపథ్యంలో గవర్నర్ ఢిల్లీ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ విషయంలో తన అధికారాల గురించి చర్చించడానికే గవర్నర్ ఢిల్లీకి వచ్చారని తెలుస్తోంది. కేంద్రం నుంచి స్పష్టమైన ఆదేశాలు అందుకుని ఇక గవర్నర్ రంగంలోకి దిగుతారని సమాచారం. రాజ్‌నాథ్ సింగ్‌తో సమావేశం అనంతరం గవర్నర్ మీడియాతో మాట్లాడారు. తాను రాజ్‌నాథ్‌ని కలవటం వెనుక వున్న అసలు విషయం చెప్పకుండా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రుల మధ్య సయోధ్య బాగుందని, రెండు రాష్ట్రాల్లో పరిస్థితులు బాగున్నాయని, త్వరలో పరిస్థితులన్నీ సర్దుకుంటాయని చెప్పారు.