420కి సవాల్ విసిరితే 840 మొరుగుతోంది!
posted on Jan 2, 2021 @ 2:45PM
వైసీపీ ప్రభుత్వం, సీఎం జగన్ పై మాటల తూటాలు పేల్చుతున్నారు టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. తన సవాల్ ను స్వీకరిస్తున్నానని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి చేసిన ప్రకటనపై లోకేష్ ఫైరయ్యారు. ‘420 జగన్‌రెడ్డికి సవాల్ విసిరితే 840 మొరుగుతోంది ఏంటి?’ అని నారా లోకేష్ ప్రశ్నించారు. ఏ1 కి దమ్ము, ధైర్యం లేదా? అని ప్రశ్నించారు. దైవం మీద ప్రమాణం అనగానే తోకముడిచి చర్చ అంటూ పారిపోతున్నారని ఎద్దేవాచేశారు. వైసీపీ ఆరోపణల్లో బురద రాజకీయం తప్ప నిజం లేదని దుయ్యబట్టారు నారా లోకేష్. తనపై జగన్ రెడ్డి చేస్తున్న, చేయిస్తున్న ఆరోపణలు అవాస్తవమని కొట్టిపారేశారు. సింహాద్రి అప్పన్నపై ప్రమాణం చెయ్యడానికి సిద్ధమని లోకేష్ సవాల్ విసిరారు. ప్రమాణం చేయడానికి జగన్ రెడ్డి సిద్ధమా? అని నారా లోకేష్ మరోసారి ప్రశ్నించారు.
రాష్ట్రంలో ఆలయాలపై వరుసగా జరుగుతున్న దాడులకు సంబంధించి తీవ్రంగా స్పందించిన నారా లోకేష్.. సీఎం జగన్ పై ఘాటు విమర్శలు చేశారు. రాష్ట్రంలోని హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులపై చర్చకు సింహాద్రి అప్పన్న ఆలయానికి రావాలని సీఎం జగన్ కు లోకేష్ సవాల్ విసిరారు. అయితే లోకేష్ సవాల్ పై స్పందించిన ఎంపీ విజయసాయి రెడ్డి..
‘‘టీడీపీ నేత లోకేష్ రమ్మన్నట్లు అప్పన్న సన్నిధికి వస్తా.. చర్చకు సిద్ధం. చర్చకు మీరే తేదీ చెప్పండి’’ అని సవాల్ విసిరారు. దీనిపై స్పంచిందిన నారా లోకేష్.. 420 జగన్‌రెడ్డికి సవాల్ విసిరితే 840 మొరుగుతోంది ఏంటి?’అని కౌంటరిచ్చారు.