టీఆర్‌ఎస్‌కు ప్రధాన ప్రత్యర్థి టీడీపీయే..
posted on Feb 11, 2016 @ 5:36PM
గ్రేటర్ ఎన్నికల్లో తెలంగాణ అధికార పార్టీ అన్ని పార్టీలను క్లీన్ స్వీప్ చేసి గెలుపును కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు దీనిపై టీడీపీ యువనేత నారా లోకేశ్ మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలంటే టీఆర్ఎస్ కి 40 వేల కోట్ల రూపాయిలు కావాలని.. తన హామీలను ఎలా అమలు చేస్తుందో వేచి చూడాల్సిందేనని అన్నారు. అంతేకాదు గ్రేటర్ ఎన్నికల గురించి మాట్లాడుతూగతంలో కంటే టీడీపీకి లక్షన్నర ఓట్లు అదనంగా వచ్చాయి.. అయినా ఎన్నికల్లో ఓడిపోతామని తెలిసినా పోటీ చేశాం.. తెలుగుదేశం అసలు లక్ష్యం 2019 ఎన్నికలు అని..రాజకీయాల్లో గెలుపోటములు సహజం అని వ్యాఖ్యానించారు.
ఇంకా టీ టీడీపీ నుండి ఎర్రబెల్లి, ప్రకాశ్ గౌడ్ లు పార్టీ మార్పుపై స్పందించి ఎంత మంది పార్టీని మారిన కేడర్ ఎటూ పోదని.. టీడీపీకి గట్టి క్యాడర్ ఉందని.. టీఆర్‌ఎస్‌కు ప్రధాన ప్రత్యర్థి టీడీపీయేనని అన్నారు.