రైలు ప్రమాదం: మృతుల కుటుంబాలకు 5లక్షల పరిహారం
posted on Dec 28, 2013 @ 10:05AM
అనంతపురం జిల్లా పుట్టపర్తి వద్ద నాందేడ్ ఎక్స్‌ప్రెస్ ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు ఐదు లక్షల చొప్పున పరిహారం ఇవ్వనున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది. తీవ్రంగా గాయపడిన వారికి లక్ష, గాయపడిన వారికీ యాభై వేలు చొప్పున పరిహారం అందజేస్తామని రైల్వే అధికారులు తెలిపారు.
అనంతపురం జిల్లా పుట్టపర్తి వద్ద నాందేడ్ ఎక్స్‌ప్రెస్ థర్ట్ ఏసీ బీ-1 బోగీలో మంటలు చెలరేగడంతో ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 23 మంది మృతి చెందగా పలువురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను సమీపంలోని ధర్మవరం అసుపత్రికి తరలిస్తున్నారు. సహయ చర్యల కోసం ధర్మవరం నుండి ప్రత్యేక రైలు రైల్వే అధికారులు ఏర్పాటు చేశారు. ప్రయాణ సమయంలో బోగీలో మొత్త 73 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం.