ఎన్టీఆర్... చంద్రబాబు... అందులో ఒక్కటే!
posted on Jun 8, 2020 @ 9:37AM
క్రమశిక్షణ విషయంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు ఒక్కటేనని నటసింహం నందమూరి బాలకృష్ణ అన్నారు. తన తండ్రి తర్వాత అంతటి క్రమశిక్షణను చంద్రబాబులో చూశానని ఆయన ప్రశంసించారు. పార్టీ స్థాపించిన తొలినాళ్లలో తెల్లవారుజామున ఎన్ని గంటలకు ఎన్టీఆర్ నుండి ఫోన్ వచ్చినా... డ్రైవర్ లేకపోయినా సరే స్వయంగా చంద్రబాబు కారు డ్రైవ్ చేసుకుంటూ వెళ్లేవారని బాలకృష్ణ తెలిపారు. తాజా ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాలు చెప్పుకొచ్చారు.
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన అభిమాని అని తెలుసుననీ, కడప టౌన్ అభిమాన సంఘం అధ్యక్షుడిగా చేశారనీ బాలకృష్ణ అన్నారు. అయితే అభిమానం, రాజకీయాలు వేర్వేరు అని స్పష్టం చేశారు. అభిమానిగా జగన్ తనను ఎప్పుడూ కలవలేదని తెలిపారు. అప్పట్లో ఎన్టీఆర్ గారికి కాంగ్రెస్ పార్టీలో బోల్డంతమంది అభిమానులు ఉండేవారనీ ఈ సందర్భంగా బాలకృష్ణ గుర్తు చేసుకున్నారు.