వారణాసిలో వేడివేడి నమో రోటీ
posted on May 8, 2014 @ 12:57PM
మొన్నటి వరకూ నరేంద్రమోడీ స్పెషల్ చాయ్ అమ్మకాలు దేశవ్యప్తంగా జరిగాయి. ఆ తర్వాత నమో జ్యూస్ షాపులు దేశమంతటా వెలిశాయి. వీటికి ప్రజల నుంచి విశేష ఆదరణ అభిస్తోంది. ఇప్పుడు వారణాసిలో నమో రోటీ దుకాణాలు ప్రారంభమయ్యాయి. బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ వారణాసి నుంచి పార్లమెంట్‌కి పోటీ చేస్తుండటంతో ఆయనకు అక్కడి ప్రజల్లో ఆదరణ లభిస్తోంది. ఈ ఆదరణను క్యాష్ చేసుకోవాలని కొందరు దాభా యజమానులు భావించారు.
అంతే వారణాసి ఏరియాలోని దాభాల్లో ‘నమో’ బ్రాండ్ రోటీలు ప్రత్యక్షమయ్యాయి. ఈ రోటీలకు వినియోగదారుల నుంచి మంచి స్పందన కూడా అభిస్తోందట. ఈ నమో రోటీల మీద ‘అబ్ కీ బార్ మోడీ సర్కార్’ (ఈసారి ప్రభుత్వం నరేంద్రమోడీదే) అనే మాటను ముద్రించి విక్రయిస్తున్నారు.
నమో రోటీల ఆవిర్భావంతో గతంలో కంటే రోటీల వ్యాపారం బాగా పెరిగిందని, రోటీలతోపాటు కర్రీల వ్యాపారం కూడా బాగా పుంజుకుందని వారణాసి ప్రాంతంలోని దాభాల యజమానులు మురిసిపోతూ చెబుతున్నారు. అయితే ఈ రోటీల అమ్మకాన్ని నిషేధించాలని కాంగ్రెస్ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు చేస్తున్న ప్రయత్నాలను స్థానిక వ్యాపారులు వ్యతిరేకిస్తున్నారు.