చంద్రబాబుకు నామా నాగేశ్వర రావు నివేదిక
posted on Dec 11, 2012 @ 10:11AM
ఎఫ్ డి ఐ ల ఫై పార్లమెంట్లో ఓటింగ్ జరిగిన సమయంలో సభకు దూరంగా ఉండిపోయిన ముగ్గురు తెలుగు దేశం సభ్యులఫై ఆ పార్టీ నేత, ఎంపి నామా నాగేశ్వర రావు చంద్ర బాబు నాయుడు కు నివేదిక సమర్పించారు.
ఎఫ్ డి ఐ లను తాము మొదటి నుండి వ్యతిరేకిస్తున్నామని, ఉభయ సభల్లో తాము చేసిన ప్రసంగాల్లో ఇదే విషయాన్ని నొక్కి చెప్పామని నామా అన్నారు. ముగ్గురు సభ్యులు వ్యక్తిగత కారణాల వల్లే ఓటింగ్ కు దూరంగా ఉండాల్సి వచ్చిందని, ఈ విషయంతో పార్టీకి సంభందం లేదని ఆయన అన్నారు. తమ పార్టీకి పార్లమెంట్ లో పెద్దగా సంఖ్యా బలం లేనందున ప్రత్యేకంగా విప్ జారీ చేయలేదని ఆయన అన్నారు.
తమ పార్టీ అధినేత కు తెలియకుండా ఓటింగ్ కు దూరంగా ఉండడమే కాకుండా, రాజీనామా చేస్తామని తమ పార్టీ అధ్యక్షుడినే దిక్కరించేలా మాట్లాడడం ఎంతవరకు సబబో పార్టీ నేతలకే తెలియాలి.
నామా నివేదిక విషయం అలా ఉంచితే, ఈ విషయం ఇక మరుగునపడుతోందని తెలుస్తోంది. ఇది చిన్న విషయమేనని, తమ ముగ్గురు ఎంపిలు కావాలని ఓటింగ్ కు దూరంగా లేరని పార్టీ నేతలు అంటున్నారు. ఈ విషయంఫై ఇతర పార్టీ నేతలు రాద్దాంతం చేయడం మానుకోవాలని ఆ పార్టీ నేత యనమల రామకృష్ణుడు అన్నారు. అసలు విషయానికి వస్తే, ఈ విషయంలో ఎక్కువ రాద్దాంతం చేస్తోంది సొంత పార్టీ నేతలే. అంటే, యనమల సలహా ఇచ్చింది తన పార్టీ వాళ్లకేనని అనుకోవాలా?