నాగార్జున ఆస్తికి టెండర్ పెట్టారు!
posted on Jun 28, 2014 @ 10:49AM
మొత్తానికి కేసీఆర్ ప్రభుత్వం హైదరాబాద్‌లో వున్న సీమాంధ్రుల తాట వలిచే కార్యక్రమాన్ని ముమ్మరం చేస్తున్నట్టుంది. లగడపాటి ల్యాంకో హిల్స్‌ని ఇప్పటికే టార్గెట్ చేసిన కేసీఆర్ ప్రభుత్వం ఇప్పుడు అక్కినేని నాగార్జున ఆస్తి మీద కన్ను వేసినట్టు తెలుస్తోంది. గురుకుల్ ట్రస్ట్ భూముల్లోని కట్టడాలను కూల్చే కార్యక్రమంలో ముమ్మరంగా వున్న టీఆర్ఎస్ ప్రభుత్వం అక్కడే వున్న అక్కినేని నాగార్జున నిర్మించిన ఫంక్షన్ హాల్ ‘ఎన్ కన్వెన్షన్’ మీద దృష్టి కేంద్రీకరించినట్టు తెలుస్తోంది. ఈ కట్టడానికి సంబంధించి నాగార్జునకు అధికారులు నోటీసులు జారీ చేశారు. తమ్మిడికుంట చెరువు పక్కనే 14 ఎకరాల స్థలంలో ఈ కన్వెన్షన్ సెంటర్ నిర్మించారు. దీని వెనుక వున్న తమ్మిడికుంట చెరువుకు చెందిన స్థలం హద్దులను గుర్తిస్తున్నారు. ఒక వేళ చెరువుకు చెందిన స్థలంలో ఎన్ కన్వె్న్షన్ సెంటర్ నిర్మించి ఉన్నట్లయితే కూల్చివేత తప్పదని కొందరు అధికారులు అంటున్నారు. అధికారంలో ఎవరు వున్నా వారితో సన్నిహితంగా వుండే నాగార్జున పొలిటికల్‌గా దాదాపు నాన్ కాంట్రవర్షియల్. ఆయన ఆస్తుల మీద కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం దృష్టి పెట్టింది.