దుబ్బాకలో ముస్లిం మహిళలు కూడా బీజేపీకే దన్నుగా నిలిచారా?
posted on Nov 10, 2020 @ 3:49PM
దుబ్బాక ఎన్నికల ఫలితాలను లోతుగా పరిశీలిస్తే, ఏఒక్క సామాజికవర్గం కూడా అధికార తెరాస ను సమర్ధించిన దాఖలాలు కనబడ్డంలేదు. ముఖ్యంగా, ముస్లిం మహిళలెవ్వరు తెరాస ను సమర్ధించకపోగా, ఆశ్చరకరంగా, బీజేపీనే బలపర్చినట్లు స్పష్టంగా తెలుస్తోంది.
దుబ్బాక నియోజకవర్గంలో సుమారు 7,000 పైగా ముస్లిం ఓట్లు ఉండగా, అందులో దాదాపు 4,000 పైగా ఒక్క దౌలతాబాద్ మండలంలోనే వున్నాయ్. ఈ ఓట్లన్నీ తమవేనని మొదటినుండి తెరాస ఎంతో ధైర్యంగా వుంది. కానీ చివరికి ఫలితాలు చుస్తే, యిదంతా తారుమారయింది. మొదటి నుండి తెరాస ఇటు దౌలతాబాద్ పైనే కాకుండా మరికొన్ని మండలాలపైన కూడా ఆశలు పెట్టుకొని వుంది. కానీ ఆ ఆశలన్నీ అడియాసలేనని ఓట్లర్లు తేల్చేశారు.
కనీసం, దౌలతాబాద్ మండలంలో కూడా తెరాస కు కేవెలం కొన్ని వొందల మెజారిటీ మాత్రమే రావడంతో అప్పుడే ఆ పార్టీ నాయకులు ఓటమిని అంగీకరించారు. ఈ మండలంలో కౌంటింగ్ మొదలైనప్పటినుండి, అంటే 17 వ రౌండ్ నుండి, తెరాస ఆశలు కొంచం పెరిగాయి. కానీ మొత్తం రౌండ్ పూర్తియ్యేటప్పటికీ, తెరాస కు వచ్చిన ఓట్లు చూసుకొని, అటు ఈ పార్టీ ఏజెంట్లు, కాంగ్రెస్ ఏజెంట్లు కూడా కౌంటింగ్ సెంటర్ల నుండి బయటకు వెళ్లిపోయారంటే పరిస్థితిని సులభంగానే అర్థంచేసుకోవచ్చు.
ముస్లిం ఓట్లపై మొదటినుండి తెరాస ఎన్నో ఆశలు పెట్టుకుంది. ఈ వర్గం ఎలాంటి పరిస్థితులలోను బీజేపీని సమర్ధించదని, కాంగ్రెస్ ఎలాగూ రేసులో వున్నా లేనట్లేనని భావించిన తెరాస, ఈ వర్గం వాళ్ళు తప్పక తమకే ఓటు వేస్తారని భావించింది. కానీ, ముస్లింలు, ముఖ్యంగా ఈ వర్గానికి చెందిన మహిళలు, ఆశ్చరకరంగా బీజేపీ ని సమర్ధించడం ఇప్పుడు పెద్ద చర్చనీయాంశమయింది. దీనికి కారణం, బీజేపీ ట్రిపుల్ తలాక్ ను వ్యతిరేకించడమేనని దీంతో, ఈ వర్గానికి చెందిన మహిళలు బీజేపీ వైపే మొగ్గు చూపుతున్నారని, రేపు రాబోయే జీహెఎంసీ ఎన్నికల్లో కూడా ఇదీ రిపీట్ కాబోతున్నాడని రాజకీయ విశ్లేషకుల భావన.