స్థలం కోసం.. అన్నను చంపిన తమ్ముడు
posted on Apr 27, 2021 8:49AM
అది తెలంగాణ. చేవెళ్ల మండలం. కౌకుంట్ల గ్రామానికి చెందిన దివిటి ఎల్లయ్య అనే వ్యక్తికి ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు అశోక్, చిన్న కుమారుడు రాజు. వారిద్దరికీ పెళ్లిళ్లు అయ్యాయి. ఎవరి కాపురం వాళ్ళు చేసుకుంటున్నారు. ఎల్లయ్య ఇంటి ముందు ఖాళీ స్థలం ఉంది. ఆ స్థలం కోసం అన్న దమ్ముల మధ్య గొడవ పడ్డారు.
ఆ విషయంలో తండ్రి మాట వినలేదు ఇద్దరు కొడుకులు. స్థలం విషయమై గ్రామ సర్పంచ్ సమక్షంలో పంచాయితీ పెట్టారు. అయినా ఫలితం లేదు. ఆ అన్నదమ్ముల నిప్పు రాజుకుంటూనే ఉంది. మధ్య చిన్న చిన్న విషయాలకే తరుచు గొడవలు జరిగేది.
సోమవారం సాయంత్రం తమ్ముడు రాజు తన ఇంటి ముందున్న ఖాళీ స్థలంలో కర్రలు పాతేందుకు గుంతలు తవ్వుతుండగా అన్న అశోక్ గుంతలు ఎందుకు తవ్వుతున్నావ్ అంటూ ప్రశ్నించగా ఇద్దరి మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఇంకా అంటే అంతలో తీవ్ర కోపానికి గురైన తమ్ముడు. అటు ఇటు చూశాడు. అన్న తనపని తాను చేసుకుంటున్నాడు. ఒక్కసరిగా రాజు బండరాయితో అన్న అశోక్ తలపై బలంగా కొట్టాడు.. అశోక్ కుప్పకూలి పడిపోయాడు.. తల నుండి తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే మృతిచెందాడని తెలిపారు.
దీంతో సమాచారం అందుకున్న చేవెళ్ల పోలీసులు వెంటనే గ్రామానికి వెళ్లి హత్యకు పాల్పడిన రాజును అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చేవెళ్ల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతునికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
సమాజం లో తన మన తేడా లేకుండా పోయింది. ఆస్తి కోసం, అత్యాశ కోసం, అధికారం కోసం, అయినా వాళ్ళనే కడతేరుస్తున్నారు. సొంత వాళ్ళనే కన్నీటి సంద్రంలో ముంచుతున్నారు. ఏం చేసిన ఎంత సంపాదించినా.. జానెడు పొట్ట కోసం.. ఆరడుగుల నెల కోసమే అని తెలుసుకోవాలి.