సముద్రం అడుగున బుల్లెట్ రైలు.. దాదాపు లక్ష కోట్లతో
posted on Apr 21, 2016 @ 4:19PM
ముంబై-అహ్మదాబాద్ మధ్య ప్రయాణించడానికి త్వరలో బుల్లెట్ రైలు వస్తున్న సంగతి తెలిసిందే. అరేబియా తీరం గుండా నడిచే ఈ రైలు సముద్రం కింద నుండి పరుగులు పెట్టనుండి. అంతేకాదు దీనికోసం భారీ సొరంగ మార్గాన్నే ఏర్పాటు చేయనున్నట్టు తెలుస్తోంది. దాదాపు రూ లక్ష కోట్లతో నిర్మించే ఈ రైలుకి.. 81 శాతం నిధులు జపాన్ నుంచి సమకూర్చుకునంటున్నట్టు అధికారులు వెల్లడించారు.. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి ఒప్పందం 2016 చివరినాటికి పూర్తి కానుండగా, 15 ఏండ్ల మారటోరియంతో ఏడాదికి 0.1 శాతం వడ్డీని 50 ఏండ్లలో చెల్లించే విధంగా ఈ ఏడాది చివర్లో ఒప్పందం జరుగుతుందని, 2018 నుంచి ప్రాజెక్ట్ పనులు ప్రారంభిస్తామని అధికారులు తెలిపారు.