ముంబై కోర్టు సంచలన తీర్పు...యాసిడ్ దాడి నిందితుడికి ఉరిశిక్ష..
posted on Sep 9, 2016 @ 11:26AM
ప్రేమకు, పెళ్లిళ్లకు ఒప్పుకోని మహిళలపై యాసిడ్ దాడులు జరగడం చూస్తూనే ఉంటాం. ఇప్పటి వరకూ ఎంతో మంది మహళలు ఈ యాసిడ్ దాడుల భారీన పడినవారు ఉన్నారు. అయితే ఇప్పుడు యాసిడ్ దాడికి పాల్పడే వారిపట్ల కఠినంగా వ్యవహరించాలని ముంబైలోని మహిళా ప్రత్యేక న్యాయస్థానం సంచలన తీర్పు చెప్పింది. ముంబైలోని ప్రీతి రాఠీ (23) అనే యువతిపై సల్యూరిక్ యాసిడ్ చల్లి ఆమె మరణానికి కారణమైన దోషి అంకుర్‌లాల్ పన్వర్ (26)కు ముంబైలోని మహిళల ప్రత్యేక న్యాయస్థానం ఉరిశిక్ష విధించింది. వివరాల ప్రకారం.. ప్రీతి రాఠీ ముంబైలోని నావికాదళం దవాఖానలో నర్సుగా ఉద్యోగం చేస్తుంది. ఆమెను పన్వర్ వివాహం చేసుకోవాలని వేధించేవాడు. దీనికి ప్రీతి నిరాకరించడంతో ఆమెపై పగ పెంచుకున్న పన్వర్.. ఆమెపై యాసిడ్ దాడి చేశాడు. దీంతో తీవ్ర గాయాలైన ఆమెను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూనే ఆమె చనిపోయింది.
కాగా ఈ ఘటన 2013లో జరిగింది. దీనిపై దర్యాప్తు చేసిన పోలీసుల ముందు ఓ స్టూడెంట్ ను అరెస్ట్ చేయగా ఆతరువాత తను కాదని తెలిసి విడుదల చేశారు. అనంతరం ముమ్మర దర్యాప్తు చేసిన పోలీసులు 2014 జనవరి 17న పన్వర్ ను అరెస్ట్ చేశారు. ఇప్పుడు అతనికి ఉరిశిక్ష పడింది.