ములాయం కు అఖిలేష్ టీం వార్నింగ్... చరిత్ర ఎవరినీ క్షమించదు..
posted on Oct 17, 2016 @ 4:04PM
ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ములాయం కుటుంబంలో ఉన్న రాజకీయ విబేధాలు రోజుకొకటి బయటపడుతున్నాయి. ఇప్పటికే ములాయం.. వచ్చే ఎన్నికల్లో సీఎం అభ్యర్ధిగా అఖిలేష్ ఉండరని సంచలన వ్యాఖ్యలు చేశారు. ములాయం చెప్పిన వెంటనే అఖిలేష్ యాదవ్ బాబాయి శివపాల్ సింగ్ యాదవ్ అఖిలేష్ కు మద్దతుగా నిలిచారు. సమాజ్ వాదీ పార్టీ తిరిగి విజయం సాధిస్తే, సీఎం పదవికి అఖిలేష్ పేరును తాను స్వయంగా ప్రతిపాదిస్తానని తెలిపారు. ఇప్పుడు దానికి ఆజ్యం పోస్తున్నట్టు అఖిలేష్ వర్గం ములాయంకు ఓ లేఖ రాసింది. 403 అసెంబ్లీ నియోజకవర్గాలున్న రాష్ట్రంలో అత్యధిక స్థానాలను గెలవలేకుంటే, ఓటమి బాధ్యత ములాయం, ఆయన సోదరుడు రాంగోపాల్ యాదవ్ లదేనని హెచ్చరించింది. అక్కడితో ఆగకుండా.. క్రూరులుగా మిగలవద్దని, భవిష్యత్తులో క్షమించలేని తప్పు చేయవద్దని, చరిత్ర ఎవరినీ క్షమించబోదని ఆ లేఖలో పేర్కొన్నారు. మరి దీనికి ములాయం ఎలా స్పందిస్తారో చూద్దాం..