Read more!

కాంగ్రెస్ కిరణ్ జాగిరా...?

 

 

రాష్ట్ర ముఖ్య మంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఫై పెద్దపల్లి ఎంపి వివేక్ విమర్శలు గుప్పించారు. ఆయన కాంగ్రెస్ పార్టీని తన సొంత పార్టీలాగా భావిస్తున్నారని ఎంపి వివేక్ వ్యాఖ్యానించారు. పార్టీలో ఉంటే ఉండండి లేక పొతే లేదు అని ముఖ్యమంత్రి అనడం సరి కాదని వివేక్ అన్నారు. సోనియా గాంధీ కూడా ఎప్పుడూ ఇలా అనలేదని ఎంపి అన్నారు.


కాంగ్రెస్ ప్రజల పార్టీ అని, తమ నాయకురాలు సోనియా గాంధీ అని, ఆమె చెప్పినట్లే తాము వ్యవహరిస్తాం తప్ప కిరణ్ చెప్పినట్లు కాదని ఆయన అన్నారు. కిరణ్ వల్ల రాష్ట్రంలో పార్టీ నష్టపోతోందని వివేక్ అన్నారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నా సమయంలో 52 స్థానాల్లో ఎన్నికలు జరిగితే 50 చోట్ల పార్టీ ఓడిపోయిందని ఆయన అన్నారు.


ముఖ్య మంత్రి పార్టీలో గ్రూపులను నడుపుతున్నారని, గతంలో ఈ పదవిలో ఉన్న ఏ నాయకుడు ఇన్ని గ్రూపులను నడపలేదని వివేక్ ఆరోపించారు. రాష్ట్రంలో పార్టీని అభివృద్ధి చేసే పనులు ముఖ్యమంత్రి చేయడం లేదని, జిల్లా స్థాయి సమావేశాలు అయన ఏనాడు నిర్వహించలేదని ఎం పి అన్నారు. కార్యకర్తల్లో మనో ధైర్యం నింపే పనులు కిరణ్ చేస్తే అంతా సంతోషిస్తారని వివేక్ హితవు పలికారు.