మోడీ ఎర్రకోట నుంచి.. కేసీఆర్ హుస్సేన్ సాగర్ లోకి దూకాలట!
posted on Apr 23, 2021 @ 3:26PM
కరోనా మహమ్మారి నియంత్రణలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. కరోనా వ్యాప్తిపై నిపుణులు సూచనలు చేసినా పట్టించుకోలేదని మండిపడ్డారు.ప్రైవేట్ మెడికల్ కాలేజీలను, హాస్పటల్స్‌ను ప్రభుత్వం వెంటనే స్వాధీనం చేసుకోవాలని, కరోనా వైద్యం అందించాలని రేవంత్ కోరారు.
కాంగ్రెస్ ప్రభుత్వాలను కూల్చడం మీద మోడీ దృష్టి పెడితే... ఎమ్మెల్యేల కొనుగోళ్ల మీద కేసీఆర్ దృష్టి నిలిపారని రేవంత్ రెడ్డి విమర్శించారు. కరోనా విషయంలో హైకోర్టు తిట్లకు సీఎం కేసీఆర్ హుస్సేన్ సాగర్లో దూకాలని, సుప్రీం తిట్టిన తిట్లకు ఎర్రకోట మీద నుంచి దూకాలని సెటైర్లు వేశారు. ఈటల రాజేందర్ తన మంత్రి పదవికి రాజీనామా చేసి గౌరవం కాపాడుకోవాలని సూచించారు. ఆయన శాఖలోని అధికారులే ఆయన్ను గౌరవించడం లేదని రేవంత్ ఆరోపించారు.
హెటేరో డ్రగ్స్ యజమానులు మందులను బ్లాక్‌లో విక్రయిస్తున్నారని, అయినా వారిపై చర్యలు తీసుకోవడం లేదని రేవంత్ మండిపడ్డారు.హెటెరో డ్రగ్స్ యజమానులు, మంత్రి కేటీఆర్‌కు రియల్ ఎస్టేట్ వ్యాపార భాగస్వామ్యం ఉందని, అందుకే చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. భారత్‌లో తయారైన వ్యాక్సిన్‌ను దాయాది పాక్‌లో ఉచితంగా వేశారని, భారత్‌లో కూడా అందరికీ ఉచితంగానే వ్యాక్సిన్‌ను వేయాలని డిమాండ్ చేశారు. జాతీయ విపత్తు చట్టం కింద వ్యాక్సిన్, ఆక్సిజన్‌ను తయారు చేసే కంపెనీలను కేంద్రం స్వాధీనం చేసుకోవాలన్నారు. ప్రధాని మోడీ నిర్లక్ష్యం వల్లే వ్యాక్సిన్, ఆక్సిజన్ దేశంలో అందుబాటులో లేకుండా పోయాయని విమర్శించారు. భారత్‌లోనే వ్యాక్సిన్ తయా