లగడపాటిపై గౌతమాస్త్రం...మౌనమే సమాధానం!
posted on Jul 9, 2012 @ 12:29PM
ఏ ఎండకాగొడుకు పట్టటం కొద్దిమందికి పుట్టుకతో వస్తుంది.దానికి మినహుయింపు కానిది విజయవాడ ఎంపి లగడపాటి. కాంగ్రెస్ పార్టీలోకి మామగారిని అడ్డంపెట్టుకొని పరిచయాలు పెంచుకున్నారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్‌రెడ్డి పేదలకోసం మండుటెండలో కాలినడకతో రాష్ట్ర పర్యటన మొదలు పెట్టినప్పుడు ఆయన వెనుక ఎ. సి. వాహనంలో అనుసరించి ఆ యాత్ర మొత్తాన్ని తానే స్పాన్సర్ చేసినట్లు బిల్డప్ ఇచ్చారు. ఆ సమయంలోనే లగడపాటి వైయస్సార్‌కు ఓ మంచి ఫారెన్ షూ కూడా ప్రజెంట్ చేశారు. నడిచేటప్పుడు కాళ్లకు నెప్పులు రాకుండా, బొబ్బలు రాకుండా. చేసిన సేవలకు ప్రతిఫలంగా లగడపాటి లోక్‌సభ టిక్కెట్ పొందారన్న ప్రచారం జరిగింది.. ఈ రోజు లగడపాటి రాజకీయాలలో ఉన్నారంటే అందుకు కారణమైన వైయస్ రాజశేఖర్‌రెడ్డిని తన రాజకీయ గురువుగా కొలవక పోయినా పర్వాలేదు కాని వైయస్ అకాల మరణం తర్వాత ప్లేటు ఫిరాయించడం వెనుక కారణం ఏమైఉంటుందున్న చర్చ బెజవాడలో జోరుగా సాగుతోంది. ఒకప్పుడు లగడపాటికి అత్యంత సన్నిహితుడుగా ఉన్న గౌతం రెడ్డి ఇప్పుడు ఆయనకు బద్ద శతృవయ్యాడు. లగడపాటిని మీడియా పరంగా ఎదుర్కోనే పనిని వై.ఎస్.ఆర్ . కాంగ్రెస్ పార్టీ గౌతం రెడ్డికి అప్పగించినట్లుంది.
దీనితో గౌతం రెడ్డి ఒంటికాలిపై లగడపాటిపై లేస్తున్నారు. వైయస్ పదవినడ్డుపెట్టుకొని జగన్ అక్రమ ఆస్తులు సంపాదించారని, జగన్ నేరస్తుడని, విజయమ్మ జగన్‌ని సరిగా పెంచెలేదని లగడపాటి అంటుంటే వైయస్ మరణం తర్వాత గాని లగడపాటికి అక్రమ ఆస్థులు గుర్తుకు రాలేదా. అంత అక్రమ ఆస్తులున్న సాక్షి దినపత్రికల్లో లగడపాటి సక్రమ ఆస్థులను 30 కోట్లు పెట్టడం దేనికి? ప్రాజెక్టులన్నింటిలో అవినీతి జరిగింది అని చెబుతున్న లగడపాటి తెలుగుగంగ ప్రాజెక్టుకు కాంట్రాక్టు పనులు ఎలా తీసుకున్నారో సెలవివ్వాలని గౌతం రెడ్డి అంటున్నారు. ఇన్ని ఆరోపణలు వైయస్సార్ చనిపోక ముందు చేస్తే లగడపాటి మాటకు విలువ వుండేదని కూడా గౌతం రెడ్డి అంటున్నారు. ఆస్ట్రేలియాలో వర్ధమాన్ ఫెర్టిలైజర్ ని లగడపాట మోసం చేశారని, వెస్ట్రన్ అస్ట్రేలియా సుప్రీం కోర్టులో ల్యాంకో కంపెనీపై 16 వేల కోట్లు నష్టపరిహారం దావా వేసారని , ల్యాంకోలో పెట్టుబడి పెట్టిన షేరు హొల్డర్లకు కోట్లాది రూపాయలు నష్టం కలిగించటానికి కారణం లగడపాటి అనైతిక వ్యాపారాలే కారణమని గౌతం రెడ్డి ఆరోపిస్తున్నారు. దివాళాతీసిన గ్రిఫ్ కోల్డ్‌మైన్స్ ను ఐసిఐసిఐకి తాకట్టు పెట్టి 3000 కోట్ల రూపాయలు అక్రమ పద్దతిలో పొందిన ల్యాంకో పై మీరు మీ నియోజక వర్గ ప్రజలకు ఏం సమాధానం చెబుతారని ఆయన ప్రశ్నిస్తున్నారు. ఒక బాధ్యతాయుతమైన పార్లమెంటు సభ్యుడిగా వుంటూ సిబిఐ ఆఫీసరు లక్ష్మీనారాయణ కాల్‌లిస్ట్‌పై హైకోర్టు విచారణ చేపట్టిన తర్వాత లగడపాటి వయనను వెనుకేసుకు రావడం వెనుక కారణం మీ తమ్ముడ్ని జగతి పబ్లికేషన్స్‌లో పెట్టుబడి పెట్టినా జె.డి. విచారణ చేపట్టక పోవడమేనా ఇంకేమైనా లాభాపేక్షవుందా అని ప్రశ్నిస్తున్నారు గౌెతం రెడ్డి. న్యాయవాది కూడా అయిన గౌతంరెడ్డి ఇలా ప్రశ్నలమీద ప్రశ్నలు సంధిస్తున్నప్పటికి రాజగోపాల్ ఒక్క సమాధానం కూడా చెప్పకపోవడం విశేషం.