దేశంలో నెంబర్ వన్ మోసగాడు కేసీఆర్!
posted on Mar 3, 2021 @ 2:37PM
భారత రాజకీయ వ్యవస్థలో కేసీఆర్‌ను మించిన బ్రోకర్, మోసగాడు లేదని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పీఆర్సీ 7శాతం అంటూ ఉద్యోగులను మోసం చేశారు. నిరుద్యోగ భృతి ఇవ్వకుండా, నోటిఫికేషన్లు వేయకుండా యువతను మోసం చేస్తున్న టీఆర్ఎస్ సర్కార్‌కు ఎమ్మెల్సీ ఎన్నికల్లో గట్టి బుద్ది చెప్పాలి కోరారు. భువనగిరి యాదాద్రి జిల్లా రామన్నపేట మండలం ఈద్గాలో ఉర్సు ఉత్సవాల్లో పాల్గొన్న కోమటిరెడ్డి.. ఈ వ్యాఖ్యలు చేశారు.
రైతుబంధు పేరుతో ప్రజలను మోసం చేసి.. సర్కార్ సొమ్ముతో ఓట్లు కొన్న టీఆర్ఎస్ పార్టీకి పొయే రోజులు దగ్గర పడ్డాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి ఖాయమని భావించి ఓటుకు ఎంతైనా పెట్టి కొనడానికి ప్రయత్నిస్తున్నారని తెలిపారు. ఈ రెండు గ్రాడ్యుయేట్ ఎన్నికల ప్రభావం రాష్ట్రంలోని 77 అసెంబ్లీ నియోజకవర్గాలపై పడుతుందని వివరించారు. కాబట్టి విద్యావంతులు, మేధావులు టీఆర్ఎస్ ఓడిపోవడమే లక్ష్యంగా తమ ఓటును కాంగ్రెస్ వేయాలి కోరారు.
కమీషన్లు వచ్చే పనులే తప్ప కమాన్ పీపుల్ లబ్దిపొందే ఒక్క పని కేసీఆర్ చెయ్యలేదని ఆరోపించారు. వాడేందుకు వీలుగా ఉన్న సచివాలయాన్ని వాస్తు పిచ్చితో కూల్చి రూ. వెయ్యి కోట్లతో నూతన సచివాలయం కట్టడం ఏంటని ప్రశ్నించారు. వర్షాకాలంలో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్న ఉస్మానియా ఆస్పత్రిని మాత్రం ఇప్పటి వరకు నిధులు మంజూరు చేయలేదని దుయ్యబట్టారు. ప్రజావసరాలకు కాకుండా కొడుకును సీఎం చేయాలనే కేసీఆర్ దృష్టి సారించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
సర్కార్ విద్యావంతులకు, నిరుద్యోగులకు మొండి చెయ్యి చూపిస్తుందన్నారు. 7శాతం పీఆర్సీ అంటూ ఉద్యోగులను అవమానించే విధంగా కేసీఆర్ వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. 1.91 ప్రభుత్వ ఖాళీలు ఉన్నాయని బిస్వాల్ కమిటీ చెప్పిన నోటిఫికేషన్లు వేయడంలో ఎందకు మీనమేషాలు లెక్కిస్తున్నారన్నారు.ఇప్పటి వరకు 4వేల పాఠశాలలు మూసి వేసి నిరుపేద బిడ్డలను చదువుకు దూరం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 55వేల మంది టీచర్లు రిటైర్ అయ్యిన ఇప్పటి వరకు డీఎస్సీ ఎందుకు వేయలేదని ప్రశ్నించారు. యువత నోటిఫికేషన్లు వేయ్యాలని డిమాండ్ చేస్తున్న దున్నపోతు మీద వర్షం పడ్డట్లు సర్కార్ వ్యవహరిస్తుందని మండిపడ్డారు.
ఇక రానున్న ఎన్నికల్లో ఓటమి ఖాయమని భావించిన కల్వకుంట్ల కుటుంబం.. రామేశ్వర్ రావుతో కలిసి హైదరాబాద్‌లో ప్రభుత్వ భూములను కబ్జా చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ సర్కార్ వచ్చిన తరువాత వీరి అవినీతి, భూకబ్జాలపై విచారణ జరిపిస్తామనని స్పష్టం చేశారు. అసలు ఉద్యోగ నోటిఫికేషన్లు వేసే పబ్లిక్ సర్వీస్ కమీషన్‌లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీచేయని సర్కార్ ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేస్తుందని ఎలా నమ్ముతారని ప్రశ్నించారు. ఏడేళ్లుగా ఒక్క నిరుపేదకు సొంత ఇళ్లు నిర్మించి ఇవ్వని కేసీఆర్‌కు ప్రజా సంక్షేమంపై మాట్లాడే హక్కులేదన్నారు. అవినీతిపై ఎక్కడ జైలుకు వెళ్లాల్సి వస్తుందని నూతన వ్యవసాయ చట్టాలకు మద్దతు తెలిపారని వివరించారు