ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ఏరువాక సేద్యం
posted on Mar 30, 2025 @ 5:51PM
ఎపిలో ఉగాది వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. విజయనగరం ఎంపి కలిశెట్టి అప్పల నాయుడు తన వ్యవసాయ క్షేత్రంలో ఏరువాక సేద్యం చేశారు. శ్రీకాకుళం జిల్లారణ స్థల మండలంలో ఉన్న తన వ్యవసాయ క్షేత్రానికి చేరుకున్న ఎంపీ ఎద్దులు, నాగలికి పూజ చేసి భూమిని దున్నారు. రైతులు అనాదిగా చేసే ఏరువాక సేద్యం ప్రతీ యేడు ఉగాది రోజు ప్రారంభించడం ఆనవాయితీగా వస్తోంది. ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఎంపి ఆకాక్షించారు. రైతు కుటుంబాల కోసం కేంద్రంలో మోదీ ప్రభుత్వం రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.