మోత్కుపల్లి భావోద్వేగం.. పసుపుజెండాతోనే సచ్చిపోతాం..
posted on Mar 30, 2016 @ 11:17AM
టీడీపీ 35 వ ఆవిర్భావ వేడుకలు ఎన్టీఆర్ భవన్ లో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి పార్టీ అధినేత.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, బాలకృష్ణ ఇంకా పలువురు టీడీపీ పెద్దలు పాల్గొన్నారు. ఈ సందర్బంగా తెలంగాణ సీనియర్ మోత్కుపల్లి నరసింహులు కాస్త భావోద్వేగంగా మాట్లాడారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీని వీడే ప్రసక్తే లేదు.. నాకు 27 ఏళ్ల వయసు ఉన్నప్పుడు రాజకీయాల్లోకి వచ్చాను.. అప్పుడు ఎన్టీఆర్ అవకాశం ఇస్తే ఎమ్మెల్యేలమయ్యాం.. ఆ తరువాత మంత్రి పదవులు కూడా అనుభవించాం..అలాంటి పార్టీని మారే ప్రసక్తి లేదు.. పసుపుజెండా కప్పుకొనే సచ్చిపోతామని ఉద్వేగంతో మాట్లాడారు. అంతేకాదు మాట్లాడుతూనే చంద్రబాబుకి సూచనలు కూడా ఇచ్చినట్టు తెలుస్తోంది. తెలంగాణలో పార్టీ పరిస్థితి గురించి కొంచెం ఆలోచించాలని.. తెలంగాణలో మేం అభద్రతకు లోనవుతున్నామని.. కానీ మేం వేరోకచోటికి పోకుండా కాపాడాల్సిన బాధ్యత పార్టీ అధినేతపైనే ఉందని చెప్పారు.
ఇక టీఆర్ఎస్ గురించి కూడా ఆయన మాట్లాడుతూ నాలుగు విమర్శనాస్త్రాలు విసిరారు. 'ఇంటికి కొత్త బర్రె వస్తే ఇంట్లో వాళ్లంతా కలిసి పెంట తీశారన్న సామెత టీఆర్ఎస్ పార్టీకి బాగా సూటవుతుందని.. ప్రస్తుతం ఆ పార్టీపై అందరికి మోజు ఉందని.. ఆ మోజు ఎక్కువ కాలం ఉండదని.. ఎద్దేవ చేశారు.