ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గా మొత్కుపల్లి?
posted on Jun 11, 2015 @ 9:21PM
రెండు తెలుగు రాష్ట్రాల మధ్య చెలరేగిన తాజా యుద్దంలో నరసింహన్ పదవికి ఎసరు తెచ్చేలా కనబడుతోంది. తెలంగాణాకు చెందిన తెదేపా సీనియర్ నేత మోత్కుపల్లి నరసింహులుని గవర్నర్ గా నియమించడానికి చంద్రబాబు నాయుడు కృషి చేస్తానని ఇదివరకే హామీ ఇచ్చి ఉన్నారు కనుక ఒకవేళ ప్రస్తుత గవర్నర్ని కేంద్ర ప్రభుత్వం మార్చాలనుకొన్నా లేదా ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి వేరేగా గవర్నర్ ని నియమించాలనుకొన్నా మొదట మొత్కుపల్లికే ఆ అవకాశం దక్కవచ్చని తెదేపా నేతలు భావిస్తున్నారు.
ఒకవేళ మొత్కుపల్లిని ఆంద్రప్రదేశ్ గవర్నర్ గా నియమిస్తే, రాష్ట్ర రాజకీయాలలో తెదేపాకే మేలు కలుగుతుంది. రాష్ర్టంలో వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గవర్నర్ వద్దకు వెళ్లి ఆంద్రప్రదేశ్ ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై నిత్యం ఏదో ఒక పిర్యాదు చేస్తూనే ఉంటారు. ఒకవేళ మొత్కుపల్లిని ఆంద్రప్రదేశ్ గవర్నర్ గా నియమిస్తే జగన్మోహన్ రెడ్డి ఇక పిర్యాదులు చేసే ఆలోచన కూడా చేయకపోవచ్చును. ఒకవేళ చేసినా ఎటువంటి ప్రయోజనమూ ఉండబోదు. అదే విధంగా మోత్కుపల్లి ఆంద్రప్రదేశ్ గవర్నర్ గా నియమితులయితే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన విజ్ఞప్తులను ఆయన త్వరగా పరిష్కరించే అవకాశం ఉంటుంది. కనుక ఒకవేళ ప్రస్తుత గవర్నర్ ని మార్చే అవకాశం ఉంటే, మోత్కుపల్లికే ఆ అవకాశం దక్కేలా చంద్రబాబు నాయుడు గట్టిగా కృషి చేయవచ్చును.