మోత్కుపల్లి హత్యకు రెక్కీ జరిగిందా
posted on Jul 8, 2013 @ 7:49PM
తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు తమ పార్టీ నేత మోత్కుపల్లి నరసింహులుని హత్య చేసేందుకు మావోయిస్టులు ఇటీవల రెక్కీ నిర్వహించారని అందువల్ల ఆయనకు అదనపు భద్రత కల్పించమంటూ ముఖ్యమంత్రికి లేఖ వ్రాయడంతో పార్టీలోమరియు తెలంగాణావాదులలో కలకలం రేగింది. తెదేపాలో ఉంటూ తెలంగాణా వాదం బలంగా వినిపిస్తూనే మరో వైపు పార్టీపై వస్తున్న విమర్శలను కూడా బలంగా తిప్పికొడుతూ పార్టీని ఒక కాపు కాస్తున్నఅతనికి రాజకీయ శత్రువులు ఉండటం సహజమే. ఆయన తెలంగాణా వాదం వల్ల, ఇటు సీమంధ్ర నేతలకు కూడా ఆయన శత్రువయి ఉండవచ్చును. అయితే అది ఆయనను హత్య చేసేంత తీవ్రమయిన శత్రుత్వం అవడానికి ఆస్కారం లేదు. మరి మోత్కుపల్లిని హత్యచేసేందుకు ఎవరు రెక్కి నిర్వహించారు? సీమంధ్ర నేతలా లేక తెలంగాణా నేతలా? లేక ఆయనకి ఇంకెవరయినా వేరే శత్రువులున్నారా?
దళితుడనయిన తనను రాజకీయంగా ఎదుర్కొనలేకనే కేసీఆరే తనను హత్య చేయించేందుకు కుట్ర పన్ని ఉంటాడని మోత్కుపల్లి ఆరోపించడంతో దీనికి రాజకీయ రంగు కూడా పులుముకోనుంది. పంచాయితీ, స్థానిక ఎన్నికలలోగెలిచేందుకే తెదేపా తమ పై ఈవిధమయిన నిరాధారమయిన ఆఅరొపణలు చేస్తున్నారని తెరాస నేతలు ప్రత్యారోపణలు మొదలు పెట్టవచ్చును.
ఏమయినప్పటికీ, ఇది తీవ్రమయిన విషయమే. ప్రభుత్వానికి లేఖ వ్రాసి సరిపెట్టుకోకుండా ఆయన తనకు తానుగా లేదా పార్టీ తరపున భద్రత ఏర్పాటు చేసుకోవడం మంచిది.