మోపిదేవికి బెయిలు మంజూరు
posted on Sep 16, 2013 @ 10:10PM
మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణకు నాంపల్లి సీబీఐ ప్రత్యేక కోర్టు సోమవారం కొన్ని షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. తీవ్ర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయనకు వచ్చేనెల 31వరకు వైద్యం కోసం మధ్యంతర బెయిలు మంజూరు చేసింది. కేవలం వైద్యం కోసమే బెయిలు మంజూరు చేస్తున్నందున ఈ సమయంలో బయట వ్యక్తులను ఎవరినీ కలువరాదని, అదేవిధంగా సాక్షులను ప్రభావితం చేయరాదని, హైదరాబాద్ విడిచి వెళ్లరాదని కోర్టు సూచించింది. ఈ షరతులలో దేనిని ఉల్లంఘించినా బెయిలు రద్దు చేస్తామని హెచ్చరించింది. మోపిదేవిని మళ్ళీ నవంబర్ 1న పోలీసులకు లొంగిపోవాలని ఆదేశించింది.
ఇక జగన్మోహన్ రెడ్డి తనకు ఇంటి నుండి భోజనం తెప్పించుకొనేందుకు అనుమతించాలని కోర్టుకు పెట్టుకొన్న పిటిషన్ను కోర్టు తిరస్కరించింది. జగన్మోహన్ రెడ్డి బెయిలు పిటిషను బుధవారంనాడు విచారణకు వస్తుంది. ఆ రోజే సీబీఐ కౌంటర్ దాఖలు చేయడంతో బాటు, అక్రమాస్తుల కేసులో ఆఖరి రెండు చార్జ్ షీట్లు దాఖలు చేయనుంది.