మంత్రివర్గ మంతనాల్లో నరేంద్రమోడీ
posted on May 19, 2014 @ 4:32PM
త్వరలో ప్రధాన మంత్రి పీఠాన్ని అలంకరించబోతున్న నరేంద్రమోడీ తన మంత్రివర్గంలో సహచరులుగా ఎవరుండాలనే అంశం మీద ప్రస్తుతం దృష్టిని కేంద్రకరించారు. దీనికోసం భారీ స్థాయిలో కసరత్తు చేస్తు్న్నారు. దీనిలో భాగంగా తన సన్నిహితుడు, భారతీయ జనతాపార్టీ ప్రధాన కార్యదర్శి అమిత్ షా, సీనియర్ నాయకుడు అరుణ్ జైట్లీ, పలువురు బీజేపీ, ఆర్ఎఎస్ నాయకులతో ఢిల్లీలోని సంఘ్ పరివార్ కార్యాలయంలో సమావేశమయ్యారు. దేశవ్యాప్తంగా పలువురు సీనియర్ బీజేపీ నాయకులు పార్లమెంట్‌కి ఎన్నికకావడంతో మంత్రి పదవులు ఆశిస్తున్న వారి సంఖ్య చాలా ఎక్కువగా వుంది. దీనితోపాటు బీజేపీకి పూర్తి మెజారిటీ వున్నప్పటికీ ఎన్నికల ముందే పొత్తు కుదుర్చుకున్న పార్టీలకు కూడా ప్రభుత్వంలో అవకాశం కల్పించాలన్న ఆలోచనలో మోడీ వున్నట్టు తెలుస్తోంది. అలా ఎన్డీయే భాగస్వా్మ్య పార్టీలలో వున్న మంత్రి పదవి ఆశావహుల సంఖ్య కూడా బాగానే వుంది. ఈ నేపథ్యంలో అన్ని వర్గాలూ సంతృప్తిపడేలా మంత్రివర్గాన్ని కూర్చడం కోసం మోడీ శ్రమిస్తున్నట్టు సమాచారం.