మీ పార్టీ అంతర్గత కుమ్ములాటలు.. మా పార్టీ కి ఆపాదిస్తే సహించేది లేదు
posted on Aug 25, 2020 @ 12:27PM
నాయకత్వలేమితో ఇబ్బంది పడుతున్న కాంగ్రెస్ పార్టీ అంతర్గత కుమ్ములాటలు తమ పార్టీకి ఆపాదిస్తే సహించేది లేదని తెలంగాణ రాష్ట్ర బిజేపి కోర్ కమిటీ సభ్యుడు మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి విమర్శించారు. ప్రధానమంత్రి కాలేకపోయాను అన్న ఆవేదనలో ఉన్న రాహుల్ గాంధీ కాంగ్రెస్ నేతలు బిజేపితో మ్యాచ్ ఫిక్స్ అయ్యారని చేసిన ఆరోపణలను ఆయన ఖండించారు. దేశంలోనూ, రాష్ట్రంలోనూ ప్రతిపక్ష పాత్రను కూడా సరిగ్గా పోషించలేకపోతుందన్నారు.
రాహుల్ గాంధీ ఎప్పుడూ ఏం మాట్లాడుతారో ఆయనకే తెలియదని, అనవసరమైన ఆరోపణలు చేసి తన స్థాయి దిగదార్చుకున్నారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీలో నాయకుల కు స్వేచ్ఛ లేదన్నారు. ఆ పార్టీ లో అంతర్గత ప్రజాస్వామ్యం కరువైందని తన లాంటి సీనియర్ నాయకుల ను కూడా టికెట్ ఇవ్వడానికి డబ్బులు అడిగారని ఆయన నిశితంగా విమర్శించారు. తెలంగాణ లో టిఆర్ఎస్ తో మ్యాచ్ ఫిక్సింగ్ కు పాల్పడింది కాంగ్రెస్ పార్టీనేనని ఆరోపించారు.