టీఆర్ఎస్ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ కొట్లాట.. ఫొటో కోసం
posted on Feb 28, 2016 @ 1:44PM
తెలంగాణలో అధికార పార్టీ రోజు రోజుకి విస్తరిస్తున్న సంగతి తెలిసిందే. అయితే విస్తరించడంతో పాటు ఆ పార్టీ నేతల మధ్య విబేధాలు రావడం కూడా మొదలయ్యాయి. తాజాగా అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల మధ్య తాగాదా ఏర్పడింది. అఖరికి అది కొట్టుకునే వరకూ వెళ్లింది. నిజామాబాద్ జిల్లాలోని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్.. ఎమ్మెల్సీ భూపతిరెడ్డిల మధ్య సంబంధాలు అంత గొప్పగా లేవు.
ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ నిజామాబాద్ మండల పరిధిలోని కాలూర్ గ్రామంలో మహిళా సమాఖ్య నూతన భవనాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ భూపతి కూడా హాజరయ్యారు. అయితే సమావేశం జరుగుతున్న సమయంలో అక్కడ ఎర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో ఎమ్మెల్సీ భూపతి ఫొటో లేకపోవడాన్ని ఆయన కార్యకర్తలు ప్రశ్నించారు. దీంతో అక్కడ వివాదం ఏర్పడింది. ఈ సమయంలోనే ఎమ్మెల్యే బాజిరెడ్డి ప్రశ్నించిన నాయకుడిపై చేయి చేసుకోవడంతో అది కాస్త ముదిరి ఇద్దరు నేతలు కొట్టుకనే పరిస్థితి ఏర్పడింది. దీంతో ఇరువురు నేతలకు సెక్యూరిటీగా ఉన్న గన్ మెన్లు అడ్డుకొని విడదీయటంతో పెద్ద కొట్లాట తప్పిందని చెబుతున్నారు. ఇక.. ఎమ్మెల్యే పై ఎమ్మెల్సీ కేసు పెడితే.. ఎమ్మెల్సీపై ఎమ్మెల్యే వర్గీయులు కేసు పెట్టేశారు.