కంట తడిపెట్టిన మంత్రి గీతారెడ్డి ?
posted on Jul 17, 2012 @ 12:59PM
సుప్రీంకోర్టు నోటీసులు అందుకున్న తమను అవినీతిపురులుగా ప్రజలు చూస్తున్నారంటూ మంత్రి గీతారెడ్డి కంటతడిపెట్టినట్లు తెలిసింది. ఆమె మంత్రివర్గ ఉప కమిటీ సమావేశానికి హాజరై మాట్లాడుతూ సహచర మంత్రులు కూడా దోషులుగానే తమను పరిగణిస్తున్నారని వాపోయారు. జగన్ అక్రమాస్తుల కేసులో తాము జీఓలు విడుదల చేసినందుకే విచారణను ఎదుర్కోవలసి వస్తోందన్న నిజాన్ని ఎవరూ నమ్మటం లేదన్నారు. సిఎం కిరణ్‌కుమార్ రెడ్డి కూడా గతంలో తప్పు తమదే అన్నట్లు వ్యవహరిస్తే కేబినెట్ నిర్ణయమని విశదీకరించామన్నారు. తాము ఆ జీఓల వల్ల ఎటువంటి లబ్దిపొందలేదన్న విషయాన్ని గుర్తించుకోవాలని కోరారు. కేబినెట్ మొత్తం అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డిని నమ్మినందు వల్లే ఆ జీఓలు విడుదల య్యాయని గీతారెడ్డి అన్నారు. తోటి మంత్రులు కూడా తమ నైతికప్రవర్తన నమ్మకపోతే ఎలా అని వాపోయారు. పూర్తి సంఫీుభావం తెలిపితే తాము ఆనందిస్తామని ఆమె అన్నారు. ఒకవేళ సంఫీుభావం చెప్పకపోయినా తమను అవినీతిపరుల్లా వేరు చేసి చూడరాదని ఆమె కోరారు.