కూరగాయల ధరలు అడిగి తెలుసుకున్న మంత్రి!
posted on Mar 31, 2020 @ 3:16PM
వరంగల్ రూరల్ జిల్లా, పాలకుర్తి నియోజకవర్గం రాయపర్తి మండల కేంద్రంలో కూరగాయల మార్కెట్ ని తెలంగాణా రాష్ట్ర పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా శాఖ మంత్రి గౌరవ ఎర్రబెల్లి దయాకర్ రావు ఆకస్మిక తనిఖీ చేశారు.
ప్రజలతో మాట్లాడి, ధరలు అందుబాటులో ఉన్నాయా అని ఆరా తీశారు.
అధిక ధరలకు కూరగాయలు అమ్మినా, బ్లాక్ మార్కెట్ కి తరలించినా, కృత్రిమ కొరత సృష్టించినా, కఠిన శిక్ష లు ఉంటాయని మంత్రి హెచ్చరించారు.
ప్రజలు స్వీయ నియంత్రణ తో, లాక్ డౌన్ పాటించాలా గుంపులుగా ఉండవద్దని, ముఖాలకు మాస్క్ లు ధరించాలని, సామాజిక దూరం పాటించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.