టాప్ లెస్ తో పోలీసు అధికారిణి సెల్ఫీ.. నన్ను నేనే అసహ్యించుకుంటున్నా
posted on Apr 20, 2016 @ 2:38PM
తప్పులు చేయడం ఆ తర్వాత పశ్చాత్తాప పడటం సహజం. ఇక్కడ ఓ పోలీసు అధికారిణి సభ్య సమాజం తలదించుకునే పనిచేసి ఆతరువాత తప్పు చేశానని పశ్చాత్తాప పడింది. ఇంతకీ సంగతేంటంటే.. మెక్సికోలోని ఎస్కోబెడోలో నిదియా కార్సియా అనే పోలీస్ అధికారిణి పెట్రోలింగ్ చేస్తూ ఓ సెల్ఫీ తీసుకుంది. అది కూడా మామూలుగా కాదు టాప్ లెస్ తో సెల్పీ తీసుకొని అక్కడితో ఆగకుండా దానిని ఫేస్ బుక్ లో పోస్ట్ చేసింది. అంతే ఈ విషయం కాస్త పోలీసు ఉన్నతాధికారుల వరకూ వెళ్లడంతో ఆమెను విచారణకు ఆదేశించారు. అంతేకాదు డ్యూటీలో, యూనిఫాంలో ఉండగానే ఆమె ఆయుధాలను పక్కన పెట్టి సెల్ఫీ దిగిందని గుర్తించి చర్యలు తీసుకున్నారు.
ఇదిలా ఉండగా జరిగిన దాని గురించి నిదియా పశ్చాత్తాపం వ్యక్తం చేయడం గమనార్హం. అలా చేసినందుకు నన్ను నేనే అసహ్యించుకుంటున్నానని, ఇద్దరు పిల్లలకు తల్లి అయినా తాను ఇలా చేయడంపై పశ్చాత్తాపం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపిందని తెలుస్తోంది. తాను తన కుటుంబానికి చెడ్డపేరు తెచ్చానంది.