జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రిగా మెహబూబా ముఫ్తీ.. 4న ప్రమాణ స్వీకారం
posted on Apr 2, 2016 @ 10:54AM
ఇన్ని రోజులుగా ఉన్న అనేక అనుమానాలకు బ్రేక్ పడుతూ జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రిగా పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ ప్రమాణం స్వీకారం చేయనున్నారు. గత కొద్ది కాలంగా పీడీపీ-బీజేపీ పొత్తుపై పలు ప్రతిష్టంభన నెలకొంది. ఇప్పుడు వాటన్నింటిని తొలగిస్తూ ఏప్రిల్ 4వ తేదీన మెహబూబా ముఫ్తీ జమ్మూకాశ్మీర్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. ఈ విషయాన్ని గవర్నర్ ఎన్ఎన్ వోరాకు తెలిపారు. కాగా భారత్‌లో సీఎంగా బాధ్యతలు చేపట్టబోతున్న రెండో మహిళగా మెహబూబా ముఫ్తీ రికార్డ్ సాధించారు. మొట్టమొదటి మహిళా ముఖ్యమంత్రి 'అన్వారా తైముర్'. ఈమె అస్సాం రాష్ట్రం నుంచి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి సుమారు 7 నెలలు విధులు నిర్వహించారు.