చీకటిలో ఏడు రాష్ట్రాలు
posted on Jul 31, 2012 @ 10:52AM
ఇప్పటిదాకా ఆంథ్రప్రదేశ్ ఒక్కటే అంథేరాప్రదేశ్ అయిందని బాధపడేవారు. కొత్తగా ఉత్తరాదిలోని మరో ఏడు రాష్ట్రాలూ అంథకారాన్ని ఎదుర్కొంటున్నాయి. ఢల్లీ, ఉత్తరప్రదేశ్, పంజాబ్, హర్యానా, హిమాచల్‌ప్రదేశ్, రాజస్థాన్, జమ్మూకాశ్మీర్ రాష్ట్రాల్లో అంథకారం తప్పలేదు. అకస్మాత్తుగా విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. దీంతో ఢల్లీతో పాటు పలు రేల్వేస్టేషన్లలో విద్యుత్తు సరఫరా ఆగిపోయింది. దాదాపు రైల్వేవ్యవస్థ స్తంభించిందని చెప్పవచ్చు. దీంతో పలు రైల్వేస్టేషన్లలో సమాచారం అందక, విద్యుత్తు లేక సుమారు 200 ఎక్స్‌ప్రెస్‌లు ఆగిపోయాయి. విద్యుత్తు వ్యవస్థలో వచ్చిన లోపం కారణంగానే ఈ రైళ్లు ఆగిపోయాయని అథికార్లు ధృవీకరించారు. వేలాది మంది రైల్వే ప్రయాణీకులు దీని వల్ల ఇబ్బందుల పాలయ్యారు.
దక్షిణాది నుంచి బయలుదేరిన ఎక్స్‌ప్రెస్‌లు ఇప్పుడు ఆలస్యంగా నడుస్తున్నాయని తాజాసమాచారం. ఉత్తరాదిలోని గమ్యస్థానం చేరటానికి అవకాశం లేక రైలు వేళలు మారిపోయాయంటున్నారు. ప్రత్యేకించి ఉత్తరాదిలోని యాత్రాస్థలాలకు బయలుదేరిన పర్యాటకుల ఇబ్బంది మాటల్లో చెప్పటం సాధ్యం కావటం లేదు. ఏ స్టేషనులో ఎంతసేపు రైలును ఆపుతారో అథికారులే చెప్పలేకపోతున్నారు. పైగా, అంథకారంలో స్టేషన్లు ఉండటంతో సమాచారం తెలుసుకోవటం కూడా కష్టమవుతోంది. ఒకేసారి ఏడురాష్ట్రాల విద్యుత్తు ఆగిపోవటం దేశచరిత్రలోనే తొలిసారి కావచ్చని అథికారులు అంటున్నారు. ఆంథ్రప్రదేశ్‌లో విద్యుత్తు పరిస్థితి త్వరలో చక్కబడుతుందని సిఎం కిరణ్‌కుమార్ రెడ్డి హామీ ఇస్తున్నారు. ఎప్పుడో అన్నది మాత్రం ఆయన ఖచ్చితంగా చెప్పలేకపోయారు.