విపక్షాల ఉప రాష్ట్రపతి అభ్యర్థి మార్గరెట్ అల్వా
posted on Jul 18, 2022 8:12AM
ఉప రాష్ట్రపతి ఎన్నికలో విపక్షాల అభ్యర్థిగా మాజీ గవర్నర్ మార్గరెట్ అల్వా పోటీ లో దిగనున్నారు. ఎన్సీపీ అధినేత శరద్ నివాసంలో సమావేశమైన విపక్షాలు మార్గరెట్ అల్వా అభ్యర్థిత్వాన్ని ఖారారు చేశాయి. ఆ తరువాత శరద్ పవార్ విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థిగా మార్గరెట్ అల్వా పేరును ప్రకటించారు. తనను విపక్షాల ఉమ్మడి ఉప రాష్ట్రపతి తనను ఎంపిక చేయడాన్ని గౌరవంగా భావిస్తున్నట్లు అల్వా పేర్కొన్నారు. తన మీద మీద నమ్మకం ఉంచినందుకు ప్రతిపక్ష పార్టీల నేతలకు కృతజ్ఞతలు చెబుతున్నానని ట్వీట్ చేశారు. కాగా, ఆమె గతంలో గోవా, రాజస్థాన్, గుజరాత్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలకు గవర్నర్‌గా పనిచేశారు.
మరోవైపు, విపక్ష పార్టీలు అభ్యర్థిని ప్రకటించడం పట్ల కేంద్ర మంత్రి గజేంద్ర షెకావత్ స్పందిస్తూ… తమకు మెజారిటీ ఉందని, ఇతర అభ్యర్థి గెలిచే అవకాశం లేదని అన్నారు. విపక్షాలు అభ్యర్థిని పోటీకి దింపకుండా ఉపరాష్ట్రపతి ఎన్నిక ఏకగ్రీవం అయ్యేందుకు సహకరించి ఉండాల్సిందని ఆయన అభిప్రాయపడ్డారు. 1969లో రాజకీయాల్లోకి ప్రవేశించిన అల్వా కాంగ్రెస్‌లో కీలక పదవులు చేపట్టారు.
1974లో తొలిసారి రాజ్యసభకు ఎంపికయ్యారు. 1980,1986,1992లో వరుసగా రాజ్యసభకు నియమితులయ్యారు. 1999లో ఉత్తర కన్నడ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. 2004 ఎన్నికల్లో పోటీ చేసి మార్గరెట్ అల్వా పరాజయం పాలయ్యారు. 2004 నుంచి 2009 వరకు కాంగ్రెస్ పార్టీకి ప్రధాన కార్యదర్శిగా సేవలు అందించారు. ఆ తర్వాత నాలుగు రాష్ట్రాలకు గవర్నర్‌గా పనిచేశారు. గోవాకు 17వ గవర్నర్‌గా సేవలందించారు. గుజరాత్, రాజస్థాన్, ఉత్తరాఖండ్ గవర్నర్‌గా పనిచేశారు.