ఉప పోలింగ్ పై మావోల ప్రభావం?
posted on Jun 13, 2012 @ 10:22AM
తమ సమస్యలు పట్టించుకోవటం లేదన్న కోపంతో ఆగ్రహించిన పలుగ్రామాల వారు ఉప ఎన్నికలను బహిష్కరించారు. తమ సమస్యలు ఎప్పుడు పరిష్కరిస్తే అప్పుడు ఈవిఎంల మీట నొక్కుతామని సమైక్యతతో నిరసన స్వరాన్ని వినిపించారు. నేతల వాగ్థానాలతో విసిగిపోయి ప్రత్యక్షచర్యలకు సిద్ధపడ్దామని స్పష్టం చేస్తున్నారు. కొన్ని చోట్ల మావోయిస్టుల పిలుపులమేరకు ఎన్నికల బహిష్కరణ జరిగింది. నెల్లూరుజిల్లా కావలి మండలం చౌదరి పాలెంలో 677మంది గ్రామస్థులు ఈ ఎన్నికలను బహిష్కరించారు. అదే జిల్లా కొడవలూరు మండలం రాచర్లపాడులోనూ గ్రామస్థులు ఇఫ్కోకిసాన్ సెజ్ కు నిరసనగా పోలింగ్ కు హాజరుకాలేదు. తమ భూములను తిరిగి ఇవ్వాలని గ్రామస్థులు డిమాండు చేశారు. అలానే ఇదే జిల్లాలోని చిననట్టు, పెదనట్టు గ్రామాల్లో కూడా ఎన్నికలు బహిష్కరించారు. ఈ గ్రామాలు నెల్లూరు లోక్ సభ నియోజకవర్గం పరిథిలోనివే. పీపుల్స్ వార పిలుపు మేరకు పోలవరం నియోజకవర్గం పరిథిలోని గుమ్ముటూరులోనూ ఎన్నికలను బహిష్కరించారు. విద్యుత్తు కోతపై నిరసన వ్యక్తం చేస్తూ ప్రకాశం జిల్లా ఒంగోలు శాసనసభ పరిథిలోని త్రోవగుంట ఎస్సీ కాలనీలో కూడా ఎన్నికలను బహిష్కరించారు.