ఉపఎన్నికల్లో మధ్యాహ్నం వరకు 50శాతం పోలింగ్
posted on Jun 12, 2012 @ 3:23PM
రాష్ట్రంలో ప్రశాంతంగా పోలింగ్ జరుగుతుందని, మధ్యాహ్నం ఒంటి గంటకు 50 శాతం పోలింగ్ అయినట్లు ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రధాన అధికారి భన్వర్ లాల్ చెప్పారు. మధ్యాహ్నం 1.30 గంటలకు ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడారు. నియోజకవర్గాల వారీగా పోలింగ్ శాతం వివరాలు ఈ దిగువ తెలిపిన విధంగా ఉన్నాయి.
పరకాల నియోజకవర్గం 35 శాతం
నరస్నపేట - 45 శాతం
పాయకరావుపేట - 52 శాతం
రామచంద్రాపురం - 47 శాతం
నర్సాపురం - 52 శాతం
పోలవరం - 46 శాతం
ప్రత్తిపాడు - 48 శాతం
మాచర్ల - 55 శాతం
ఒంగోలు - 51 శాతం
ఉదయగిరి - 52 శాతం
రాజంపేట - 51 శాతం
రైల్వే కోడూరు - 48 శాతం
రాయచోటి - 51 శాతం
ఆళ్లగడ్డ - 51- శాతం
ఎమ్మిగనూరు -50 శాతం
రాయదుర్గం 52 శాతం
అనంతపురం - 38 శాతం
తిరుపతి - 39 శాతం
నెల్లూరు లోక్సభ నియోజకవర్గం 50 శాతం
సిపిఐ ఎంఎల్ డెమోక్రసీ పిలుపు మేరకు పోలవరం నియోజకవర్గం చింతపల్లి, తుములూరు గ్రామాలలో పోలింగ్ని బహిష్కరించినట్లు భన్వర్ లాల్ తెలిపారు. నెల్లూరు లోక్సభ అభ్యర్థి టి.సుబ్బరామిరెడ్డిపై ఫిర్యాదు అందిందని చెప్పారు. కలెక్టర్ని నివేదిక కోరినట్లు చెప్పారు.