కావూరి కొత్త పల్లవి
posted on Jun 18, 2013 @ 11:15AM
తనకు కేంద్ర మంత్రి పదవి రాకపోతే సమైక్యాంధ్ర ఉద్యమం మొదలు బెట్టి రాగానే ఈవిధంగా మాట మార్చడం గమనిస్తే ఆయనకు సమైక్యాంధ్ర ఉద్యమం కేవలం ఒక రాజకీయ సోపానమే తప్ప దాని పట్ల ఎటువంటి నిబద్దత లేదని అర్ధం అవుతోంది. అయితే అంత మాత్రాన్నసమైక్యవాదిగా ఆయనకున్న ముద్ర చెరిగిపోదు గనుక కేంద్రం కూడా తెలంగాణావాదులను పక్కన బెట్టి సీమాంధ్ర నేతలకే ప్రాధాన్యత ఇస్తోందని అర్ధం అవుతోంది. ఇది పార్టీలో తెలంగాణా నేతలకు ఆగ్రహం తెప్పించవచ్చును. తెలంగాణా వాదన గట్టిగా వినిపించిన వారిని పార్టీలో పక్కన పెడతారనే అపవాదుని ఇప్పుడు కాంగ్రెస్ నిజం చేసి చూపినట్లయింది. దీనివల్ల ఇప్పటికిప్పుడు కాంగ్రెస్ పార్టీకి వచ్చే నష్టం ఏమి లేకపోయినప్పటికీ, ఇది క్రమంగా ఆ పార్టీని తెలంగాణాలో నిర్వీర్యం చేయడం ఖాయం. కిరణ్ కుమార్ రెడ్డి క్యాబినెట్ విస్తరణలో మంత్రి పదవులాశిస్తున్న తెలంగాణా నేతలు ఇక ముందు తెలంగాణా అంశంపై మాట్లాడేందుకు వెనుకంజ వేయవచ్చును. దానిని అదునుగా తీసుకొని తెరాస తెలంగాణాలో పూర్తి ప్రయోజనం పొందే ప్రయత్నం చేయవచ్చును. ఇక, కేంద్రం సమైక్యాంధ్ర నేతలకే ప్రాధాన్యం ఇస్తూ తెలంగాణా నేతలని నిర్లక్ష్యం చేయడం గురించి కూడా బాగా ప్రచారం చేసుకొని ఎన్నికలలో రాజకీయ లబ్ది పొందవచ్చును.