బీటెక్ లో లవ్.. జాబ్ వచ్చాక బ్లాక్ మెయిల్..
posted on Apr 6, 2021 @ 12:00PM
వాళ్ళు ఇద్దరు ఒకే కాలేజీ లో చదువుకున్నారు. అమ్మాయి ఇంజినీరింగ్, అబ్బాయి ఎంబీఏ. కాలేజ్ చదువుకునే రోజుల్లో కలిసి మెలిసి తిరిగారు. స్నేహంగా ఉన్నారు. ఫోటోలు దిగారు. స్నేహం ముసుగులో తాచుపాముల కాటు వేయడానికి కాచుకూచున్న మణికంఠ ఆమె ఇంజినీరింగ్ ఫోర్త్ ఇయర్ లో అతడి ఇంటికి తీసుకువెళ్లాడు. అత్యాచార* చేసేందుకు ప్రయత్నించాడు. ఆమె అక్కడి నుండి తప్పించుకుని బయటకు వచ్చింది. కట్ చేస్తే.. ఆ అమ్మాయి హైదరాబాద్‌లో ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీ జాబ్ జాయిన్ అయింది. ఆ అమ్మాయికి తల్లి దండ్రులు పెళ్లి సంబంధం చూడడం కోసం. మ్యాట్రీమోని వెబ్‌సైట్ లో ఫొటోస్ తో పాటు ప్రొఫైల్ పెట్టారు. మ్యాట్రీమోని వెబ్‌సైట్ ఫోటోలు చూసిన మణికంఠ గత నెల 25వ తేదీన ఆమె ఇంటికి వచ్చి తనను వివాహం చేసుకోకపోతే చంపేస్తానని బెదిరించాడు.
ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీలో పని చేస్తుండగా..లాక్ డౌన్ కారణంగా వర్క్ ఫ్రం హోం కావడంతో ఇంటి నుంచే ఉద్యోగం చేస్తున్నారు. మళ్ళీ తిరిగి ఈ నెల 1వ తేదీన ఆమె ఇంటికి వచ్చి అసభ్యకరంగా మాట్లాడారు మణికంఠ. ఇద్దరూ కలిసి ఉన్న ఫొటోలు, వీడియోలు తన దగ్గర ఉన్నాయని, వాటిని సామాజిక మాధ్యమాల్లో పెడతానని బెదిరించాడు. ఆ యువకుడు అత్యాచార యత్నానికి పాల్పడటంతో పాటు తనతో దిగిన ఫొటోలతో బెదిరిస్తున్నట్లుగా ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.