రాజ్యాధికారంకోసం మందకృష్ణ కొత్త పార్టీ
posted on Sep 4, 2012 @ 4:24PM
యస్స్ వర్గీకరణ జరపాలంటూ ఉద్యమించిన మందాకృష్ట మాదిగ త్వరలో తమ జాతి రాజ్యాధికారం కోసం ఓ పార్టీని పెట్టబోతున్నారు. రాష్ట్రంలో యస్సీ వర్గీకరణ ద్వారా మాదిగలకు న్యాయం చేయాలన్న డిమాండ్ తో నాలుగేళ్లపాటు ఉద్యమాన్ని నడిపిన మందకృష్ణ.. హక్కుల్ని సాధించుకున్నారు. పుట్టుకతోనే గుండెజబ్బులున్న పిల్లలకు ప్రభుత్వ సాయంతో పూర్తి ఉచితంగా ఆపరేషన్లు చేయించాలని డిమాండ్ చేసి వై.ఎస్ హయాంలో మరో ఉద్యమాన్ని నడిపి పంతాన్ని చెల్లించుకున్న గట్టి మనిషి మందకృష్ణ. ఆరోగ్యశ్రీకి ఇదే ప్రేరణ. ఆరోగ్య శ్రీ ద్వారా లభ్ది పొందుతున్న రోగులంతా ఓ రకంగా మందకృష్ణకి కృతజ్ఞతలు చెప్పుకుని తీరాల్సిందే. ప్రస్తుతం ఆయన.. వికలాగుల సంక్షేమంపై దృష్టిపెట్టారు. వికలాంగులకు రిజర్వేషన్లు కల్పించాలని, నెలకు పదిహేనొందల రూపాయల పించన్ చెల్లించాలని అధికార పార్టీ పై ఒత్తిడి తెస్తున్నారు. కొత్తగా రాజకీయ పార్టీని స్థాపించి రాజ్యాధికారాన్ని హస్తగతం చేసుకోవడంద్వారా ఎస్సీ వర్గీకరణను సాధించుకోవాలని మందకృష్ణ గట్టిగా అనుకుంటున్నారు. దీనికోసం డిసెంబర్ లో కొత్తపార్టీ పెట్టాలని నిర్ణయించుకున్నారు.