దేవుడా... యువకుడిపై యువకుడు అత్యాచారం..
posted on Aug 10, 2016 @ 5:09PM
సాధారణంగా ఆడవాళ్లపై మగవాళ్లు అత్యాచారం చేస్తుంటారు.. ఇలాంటి ఘటనలు చాలానే వింటుంటా. అయితే ఇక్కడ ఒక యువకుడు.. ఇంకో యువకుడిని అత్యాచారం చేసిన ఘటన వెలుగుచూసింది. వినడానికి కొంచెం విచిత్రంగా ఉన్నా ఇది నిజం. వివరాల ప్రకారం.. ఆగ్రాకు చెందిన 35 ఏళ్ల యువకుడికి, ఇండోర్ కు చెందిన మరో యువకుడితో ఫేస్ బుక్ ద్వారా ఫ్రెండ్ షిప్ ఏర్పడింది. ఈ క్రమంలోనే వాళ్లిద్దరూ ఒకరోజు కలుసుకొని.. ఆగ్రాలోని తాజ్ మహల్ ఇంకా అనేక ప్రదేశాలు తిరిగి.. ఒక హోటల్ లో బస చేశారు. ఇక ఇద్దరూ అక్కడ మద్యం సేవించారు. అయితే ఇండోర్ కు చెందిన వ్యక్తి.. ఆగ్రాకు చెందిన యువకుడి తాగే మందులో మత్తు మందు కలిపి ఇచ్చాడు. అతను స్పృహ కోల్పోయిన తరువాత.. అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతేకాదు దానిని వీడియో తీసి సదరు వ్యక్తిని డబ్బులు ఇవ్వాలని బెదిరించాడు. లేకపోతే ఆన్ లెన్లో పెడతానని చెప్పాడు. దీంతో అతను జరిగిన విషయం మరో ఫ్రెండ్ కు చెప్పగా.. అతని సలహా మేరకు పోలీసులకి ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు నిందితుడి కోసం దర్యాప్తు చేపట్టారు.