మ్యాట్రి మోనీలో ఫేక్ ప్రొఫైల్.. 30 లక్షలు మోసం.
posted on Mar 22, 2021 @ 3:48PM
పూర్వం పెద్దలు పెద్దలు తెచ్చిన సంబంధాన్ని తల వంచుకుని మనుమడేవాళ్లు .. పెళ్లి సంబంధం కాయం చేయడం అంటే.. అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు చూడాలంటారు. ఒక సామెత కూడా ఉంది. కాలం మారింది. పెళ్లి చేసుకునే వాళ్ళ ఆలోచనలు మారాయి. సాంప్రదాయ బంధంగా చేసుకోవాల్సిన పెళ్లి చూపులు సైట్, స్కైప్ లలో చేసుకుంటున్నారు. పద్ధతులు, పచ్చని తోరణాలు, పది మంది మధ్యలో జరగాల్సిన పెళ్లిళ్లు ఫంక్షన్ హాల్స్ లకు పరిమితం చేశారు. అమ్మ నాన్నల్ని నమ్ముకుని పెళ్లి చేసుకునే వాళ్ళు సైట్లను నమ్ముకుని మోసపోతున్నారు.
సాఫ్ట్ వేర్ ఇంజినీర్ నంటూ మ్యాట్రి మోనీ వెబ్ సైట్ ద్వారా అమ్మాయి కుటుంబంతో సంబంధం కలుపుకొని... అమ్మాయి వాళ్ళ అమ్మానాన్నలకు అబ్బాయి ప్రొఫైల్ నచ్చడంతో పెళ్లి చేయడానికి సిద్ధమయ్యారు. కట్నం కిందికి భారీగానే కోరాడు మనోడు. సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కాబట్టి మా కూతురు హ్యాపీ ఉంటుందని అందరి తల్లి దండ్రులు ఆలోచించినట్లే ఆలోచించారు ఆ తల్లీదండ్రులు.. అతను అడిగిన మొత్తానికి కట్నం గా ఒప్పుకున్నారు. ఇక అంతే పెళ్లి అవ్వక ముందుకే అతని పంట పండింది. సరిగ్గా పెళ్లికి ఒక రోజు ముందే మొత్తం డబ్బులు తీస్కుని మండపం నుంచి పరారైయ్యాడు ఘరానా పెళ్లి కొడుకు.
చెందిన నిందితుడు రాజు ( పేరు మార్పు) మ్యాట్రి మోనీ వెబ్ సైట్ ద్వారా అమ్మాయిలను వలలో వేస్తూ.. వారి కుటుంబంతో పెళ్లి మాటామంతి కలిపి కట్నం డబ్బులు చేతిలో తళుక్కుమనగానే అక్కడి నుంచి జంపుజిలానీ చేసిన దాఖలాలు అనేకం. అయితే తాజాగా బాధితురాలు హారిక సింగ్ (పేరు మార్పు) కుటుంబంతో మ్యాట్రి మోనీ వెబ్ సైట్ ద్వారా తన కూతురుకి సంబంధాలు వెతుకుతుండగా, నిందితుడు రాజు తన ఫేక్ ప్రొఫైల్ తో వారికి పరిచయం అయ్యాడు. తానొక సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అని, ఉన్నత కుటుంబానికి చెందిన వాడినంటూ వారందరినీ నమ్మించాడు. తనకు కట్నకానుకల కింది 30 లక్షల నగదు, బంగారం కావాలని డిమాండ్ చేశారు. మంచి సంబంధం అని నమ్మిన అమ్మాయి తల్లిదండ్రులు సంబంధం ఓకే చేసుకొని నిశ్చితార్థం చేశారు.
ఇంకే ముంది రాజుకి ఒక్క దెబ్బతో రెండు పిట్టలు అనుకున్నాడు.. కట్నం కింద డబ్బు.. నిశ్చితార్థం కింద హారిక దొరకడంతో చెట్టాపట్టాలు వేసుకొని సినిమాలు, షికార్లు అంటూ హారికతో ఫుల్ ఎంజాయ్ లో మునిగి తేలాడు. పెళ్లి ముహూర్తం దగ్గర పడే కొద్దీ, తనకు కట్నం డబ్బులు కావాలని హారిక ఫ్యామిలీని బలవంత పెట్టాడు. దాంతో వాళ్ళు పెళ్లికి ఒక రోజు ముందు మొత్తం నగదు ఇస్తామని హారిక తల్లిదండ్రులు చెప్పారు. పెళ్లి ముందు రోజు రాత్రి జరిగిన వేడుకల తర్వాత అమ్మాయి తల్లిదండ్రులు మొత్తం రూ.30 లక్షల నగదును రాజు చేతిలో పెట్టారు. ఏదైతేనేమి కూతురికి మంచి సంబంధం, సాఫ్ట్ వేర్ ఉద్యోగం ఉన్న మొగుడు దొరికారాని అనుకున్న ఆ తల్లి దండ్రులు సంతోషాన్ని తెల్లవారితే లేకుండా చేశాడు. తెల్లవారితే పెళ్లి అని ఎవరి పనులోవాళ్ళు మునిగి ఉండగా. పొద్దునే రాజు మొత్తం డబ్బులు తీస్కుని. మారువేషంలో పెళ్లి మండపం నుంచి పారిపోయాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ ఘజియాబాద్ లో చోటుచేసుకుంది.